పాశమైలారం పారిశ్రామిక వాడలో సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి

ప్రపంచ ఆధిపత్యం కోసమే అమెరికా దాడులు భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం బ్రిటిష్ తెల్ల దొరల నుండి భారతదేశ విముక్తి కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప పోరాట వీరుడు భగత్ సింగ్ సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు: ప్రపంచ ఆధిపత్యం కోసమే అమెరికా సామ్రాజ్యవాదం దాడులు చేస్తుందని భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలని సిఐటియు రాష్ట్ర వర్కింగ్ […]

Continue Reading

యువతి,యువకులు భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలి ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోటా

-వైద్యం అందరికీ అందుబాటులో కొస్తేనే దేశాభివృద్ధి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య -సిఐటియు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు: స్వతంత్ర పోరాట యోధుడు, విప్లవ వీరుడు నవతరానికి స్ఫూర్తి అయినా భగత్ సింగ్ ను యువతి, యువకులు ఆదర్శంగా తీసుకోవాలని ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోటా అన్నారు. పటాన్ చెరు పట్టణం లోని శ్రామిక్ భవన్ లో సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆమేధా ఆస్పత్రి సౌజన్యంతో […]

Continue Reading

శ్రమదోపిడీ లేనటువంటి సమాజం కోసం పోరాడాలి

భగత్ సింగ్ త్యాగ స్పూర్తితో కార్పొరేట్ల,సామ్రాజ్యవాద, మతోన్మాద, ప్రభుత్వ విధానాలపై పోరాడదాం మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ లౌకిక విధానాన్ని కాపాడుకోవడమే నిజమైన నివాళి వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతుల ప్రదానం సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు,శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు. మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు: భగత్ సింగ్ త్యాగ స్పూర్తితో కార్పొరేట్ల,సామ్రాజ్యవాద, మతోన్మాద, ప్రభుత్వ విధానాలపై పోరాడదామని సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు,శాండ్విక్ యూనియన్ అధ్యక్షులు చుక్కా రాములు పిలుపునిచ్చారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు […]

Continue Reading

సమాజంలో సమానత్వాన్ని పెంచేది విద్య  పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

విద్యా భారతి పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి 20 లక్షల రూపాయల భారీ విరాళం మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు: విద్య అనేది మనిషి జీవితాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనమని సమాజ అభివృద్ధికి వ్యక్తిగత ఎదుగుదలలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీలో గల విద్యా భారతి పాఠశాలలో 20 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన అదనపు […]

Continue Reading

సీతారాముల కల్యాణానికి రారండి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని ఈనెల 25 తేదీ నుండి 29వ తేదీ వరకు పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆదివారం ఉదయం దేవాలయం ఆవరణలో పటాన్ చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి   ఆవిష్కరించారు.దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ కోదండ […]

Continue Reading

గంగా జమూన తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక మాజీ కోఆప్షన్ మెంబెర్ మొహమ్మద్ బషీర్ ఖురైషి

మనవార్తలు ప్రతినిధి , అమీన్‌పూర్ : రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అమీన్‌పూర్ మాజీ కో ఆప్షన్ మెంబర్ బషీర్ ఖురైషి అన్నారు.రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం కృష్ణారెడ్డి పెట్ ఈద్గాలో ముస్లిం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో బషీర్ ఖురైషి పాల్గొన్నారు.ప్రార్ధనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ ప్రార్ధనలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలివచ్చి ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా బషీర్ అహ్మద్ అలీ ఖాన్ మాట్లాడుతూ […]

Continue Reading

రామాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ భారీ విరాళం

పటాన్‌చెరు ఏపీఆర్ లగ్జూరియా కమ్యూనిటీలో రామాలయ నిర్మాణ పనుల పరిశీలన నూతన దేవాలయం నిర్మాణాలకు ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు మరోమారు తన దైవభక్తిని చాటుకున్నారు. ప్రజల్లో భక్తి భావం పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. తాజాగా పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఏపీఆర్ లగ్జూరియా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం, శివాలయం దేవాలయాల నిర్మాణానికి 75 లక్షల […]

Continue Reading

రంజాన్ తోఫా పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ మాద్రి పృథ్వీరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని పటాన్‌చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీ, నాగులమ్మ గడ్డ, రాఘవేంద్ర కాలనీ, సారాయి, భకత్ గల్లి, వెంకటేశ్వర కాలనీలలో నివసిస్తున్న పేద ముస్లిం మహిళలకు రంజాన్ కిట్లు పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ మాద్రి పృథ్వీరాజ్ 8 సంవత్సరాలుగా ఎండీఆర్ ఫౌండేష‌న్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ, పండుగల సందర్భంలో పేదల ముఖాల్లో ఆనందం నింపుతున్నారని పలువురు కొనియాడారు .దసరా, క్రిస్మస్, […]

Continue Reading

గీతంలో జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవ వేడుకలు

ముఖ్య అతిథిగా ఐఐసీటీ శాస్త్రవేత్త డాక్టర్ సిస్ట్లా రామకృష్ణ, ఆత్మీయ అతిథిగా డాక్టర్ వంశీ మాడుగుల మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రొఫెసర్ ఎం.ఎల్. ష్రాఫ్ 124వ జయంతిని పురస్కరించుకుని, హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో బుధవారం జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ‘ఔషధశాస్త్రంలో కృత్రిమ మేధస్సు: ఔషధ విద్య, పరిశోధనలలో ఒక నూతన ఒరవడి’ ఇతివృత్తంగా దీనిని నిర్వహించారు.ఐఐసీటీ-హైదరాబాదు ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సిస్ట్లా రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, వర్ధమాన […]

Continue Reading

గీతంలో ముగిసిన పౌర రక్షణ వాలంటీర్ల శిక్షణ

విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు గుర్తింపు కార్డు, ప్రశంసా పత్రాల ప్రదానం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో వారం రోజుల పాటు నిర్వహించిన పౌర రక్షణ వాలంటీర్ల శిక్షణా కార్యక్రమం బుధవారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల సహకారంతో, తెలంగాణ అగ్నిమాపక విపత్తు స్పందన అత్యవసర & పౌర రక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.వైమానిక దాడులు, రసాయన సంఘటనలు, అణు ధార్మికత పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల […]

Continue Reading