పటాన్చెరు పట్టణంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

_మోదీ జీ.. తెలంగాణలో మీ ఆటలు సాగవు.. _టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బిజెపి పన్నిన కుట్రను నిరసిస్తూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, […]

Continue Reading

విలేకరులను దూషించిన రాజు గౌడ్ పై చర్యలు చేపట్టాలి: టియుడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్

మనవార్తలు ,కొల్లూరు: అకారణంగా విలేకరులను దూషించడమే కాకుండా దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు రాజు గౌడ్ పై తగిన చర్యలు తీసుకోవాలని టియుడబ్ల్యూజే ఐజేయు సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు  అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. కొల్లూరు లో జరిగిన పేకాట రాయుళ్ల అరెస్టు విషయంపై వివరాలను సేకరిస్తున్న మీడియా ప్రతినిధులను రాజు గౌడ్ తన అనుచరులతో వచ్చి ఇష్టానుసారంగా బూతులు తిట్టడమేకాకుండా దాడి చేశారు. దీంతో రాజు గౌడ్ పై మీడియా ప్రతినిధులు పోలీసులకు […]

Continue Reading

ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించండి…ఫార్మశీ విద్యార్థులకు ప్రిన్సిపాల్ ఉద్బోధ

మనవార్తలు ,పటాన్ చెరు: ఫార్మశీ విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణలో తమకున్న జ్ఞానాన్ని సమాజానికి పంచి , ప్రజలను చైతన్య వంతులుగా చేయాలని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ పిలుపునిచ్చారు . గీతం ఫార్మశీ విద్యార్థుల సంఘాన్ని ( జీపీఎస్ఏ ) గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , ఆరోగ్య పరిరక్షణ , పరిశుభ్రత , ఔషధ వినియోగం , వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు వంటి […]

Continue Reading

సృష్టికి ఆధారం మహిళే…

– సానుకూలతను చాటిచెప్పిన గీతం విద్యార్థి విభాగం మనవార్తలు ,పటాన్ చెరు: సృష్టికి ఆధారమైన మహిళల పట్ల సానుకూలత దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లోని బుధవారం ‘ తవిషి – ధైర్యం ‘ అనే శీర్షికన ‘ విమెన్ లీడర్షిప్ ఫోరమ్ ‘ ( గీతం విద్యార్థి విభాగం ) ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది . మహిళల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు వారు ఈ తరానికి ఎలా […]

Continue Reading

జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్

_ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి _టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: నూతన టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పుడే మనం ఎంచుకున్న రంగంలో రాణించేందుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు.గ్రేటర్ హైదరాబాద్ ఫోటో-వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం, పటాన్చెరు ఫోటో& వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం అధ్వర్యంలో శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సెమినార్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా […]

Continue Reading

గీతమ్ ప్రమాణ సెక్రటేరియట్ ప్రారంభం…

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో ప్రమాణ -2 కే 23 సచివాలయాలన్ని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ కరుణాకర్.బి . , స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ సునీలక్కుమార్లు శుక్రవారం సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు . గీతమ్లో ప్రతియేటా మూడు రోజుల పాటు సాంకేతిక – సాహిత్య – నిర్వహణల మేలు కలయికగా నిర్వహించే […]

Continue Reading

స్కేటింగ్లో గీతం విద్యార్థినికి బంగారు పతకం

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థినులు ఇద్దరు గుజరాత్లోని అహ్మదాబాద్లోని సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు నిర్వహించిన జాతీయ పోటీలలో రాణించి రోలర్ స్కేటింగ్లో పతకాలు సాధించినట్టు క్రీడల సంచాలకుడు కె.అరుణ్ కార్తీక్ వెల్లడించారు . హెదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లో బీఏ ( సెక్షాలజీ ) రెండో ఏడాది విద్యార్థిని క్వాడ్ ఫ్రీస్టైల్డ్ స్కేటింగ్ ( ఆర్టిస్టిక్ ) ఈవెంట్లో తెలంగాణ రాష్ట్రం […]

Continue Reading

ఏపిజివిబి పుల్కల్ ఆధ్వర్యంలో బీమా నమోదు

మనవార్తలు ,పుల్కల్:  మంజీర గ్రామీణ వికాస్ బ్యాంక్ పుల్కల్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని పుల్కల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంజీర గ్రామీణ వికాస్ బ్యాంక్ పుల్కల్ శాఖలో ఖాతా ఉన్న 18 నుండి 70 వయస్సు గల ప్రతి ఒక్కరూ రూ 436/-, మరియు రూ 20/- రూపాయలతో బీమా చేసుకోవాలని తెలిపారు. […]

Continue Reading

విద్యార్థి సంఘం నాయకుడి ఆధ్వర్యంలో బండ ప్రకాష్ జన్మదిన వేడుకలు

మనవార్తలు , శేరిలింగంపల్లి: బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి, తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు,, ముదిరాజ్ జాతి మార్గదర్శి, తెలంగాణ మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ జన్మదిన వేడుకలను యూనివర్శటీ ఆఫ్ హైదరాబాద్ లో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వై.శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ బీసి సంఘాల నాయకులు, పరిశోధక […]

Continue Reading

ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో చలో డిల్లి ప్రోగ్రాం

మనవార్తలు , శేరిలింగంపల్లి: దేశంలోఅత్యధిక జనాభా కలిగిన బిసిలను దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా కేవలం ఓట్లు వేసే మిషన్ల గానే చూస్తున్నాయని. ఇప్పటిదాకా నమ్మి ఓట్లు వేసి గెలిపించుకున్న వాళ్లు ఎటువంటి సహాయం చేయడం లేదని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ ముదిరాజ్ తెలిపారు..అక్రమ సంపాదనకే పెద్ద పీట వేసుకుని ఉన్నారని ఈ రాజకీయ పార్టీలు దొంగల ముఠాలుగా ఏర్పడి ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నాయని […]

Continue Reading