క్రెడిట్ కార్డుల రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక యువకుడి ఆత్మహత్య

_బ్యాంకర్ల సై కఠినచర్యలుతీసుకోవాలని కుటుంబసభ్యుల డిమాండ్ మనవార్తలు ,రామచంద్రాపురం: తీసుకున్న అప్పు చెల్లించినప్పటికి ఇంకా డబ్బులు కట్టాలని వేధించడం తో పాటు, ఏజెంట్లు బాధితుడి ఇంటికి వచ్చి దాడి చేయడం తో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా ఖద్గల్ గ్రామానికి చెందిన రామారావు (35) స్వప్న లకు ఏడు సంవత్సరాల క్రితం పెళ్లయింది. సంగారెడ్డి […]

Continue Reading

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

రామచంద్రాపురం, మనవార్తలు ప్రతినిధి : భైక్ పై వెళ్తున్న యువకున్ని గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన ఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా, రెగోడ్ మండలం, ప్యారారం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ విట్ఠల్, జయమ్మ ల పెద్దకుమారుడు ప్రేమ్ కుమార్ (25), ఎస్.ఎన్ కాలని,రామచంద్రాపురంలో నివసిస్తూ బైక్ షో రూమ్ లో సేల్స్ ఎగ్జ్ క్యూటివ్ గా పనిచేస్తున్నాడు. కాగా సోమవారం అర్ధరాత్రి […]

Continue Reading

భార్యపై అనుమానంతో భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగాహత్య చేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య

– కుటుంబo మొత్తం చనిపోవడం పట్ల చుట్టుపక్కల వాళ్ళు దిగ్భ్రాంతి మృతుల పట్ల పలు అనుమానాలు ? మనవార్తలు , శేరిలింగంపల్లి: భార్య పై అనుమానం తో తరుచూ గొడవలు పడుతూ భార్య తో పాటు ఇద్దరు పిలల్లను దారుణంగా హత్యచేసి చివరకు భర్త సైతం ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సంగారెడ్డి జిల్లా, మ్యూనిపల్లి మండలం పోల్కంపల్లి కి చెందిన ఎం. […]

Continue Reading

సీఐ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించిన పోలీస్ శాఖ

మనవార్తలు ,హైదరాబాద్: సీఐ నాగేశ్వరరావు రావును సర్వీస్ నుంచి తొలగిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వనస్థలిపురంలో మహిళను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసిన కేసులో ఆయన జైలుకెళ్లి ఇటీవలె బెయిల్పై విడుదలయ్యారు. తీవ్రమైన నేరారోపణలు ఉన్నందున ఆర్టికల్ 311(2) బి కింద సర్వీస్ రిమూవల్ చేశారు. సర్వీస్ రిమూవల్ కోరుతూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. రిక్రూట్మెంట్ అథారిటీకి లేఖ రాయగా..సీపీ లేఖను పరిగణలోకి తీసుకున్న పోలీస్ రిక్రూట్మెంట్ అథారిటీ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి […]

Continue Reading

ఆమీన్పూర్లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్

_భయాందోళనలో స్థానికులు మనవార్తలు, పటాన్ చెరువు: అమీన్పూర్లో రాత్రిపూట కాలనీల్లో చెడ్డీలతో తిరుగుతూ హల్చల్ చేస్తున్నారు దుండగులు. తాళం వేసిన ఇళ్ల కోసం తిరు గుతూ భయాందోళనకు గురి చేస్తున్నారు. ఒంటిపై ఉన్న బట్టలు, చెప్పులు తీసి చేతిలో పట్టుకుని కాలనీల్లో తిరుగుతున్నారు. కొన్ని ఇళ్లల్లోకి ప్రహరీ గోడలు దూకి ఇళ్లను తనిఖీ చేస్తున్నారు. ఆయా కాలనీల్లో సీసీ కెమెరాలు ఉండటంతో పుటేజీలు చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సీఐ శ్రీనివాసులురెడ్డి మాట్లా డుతూ. రాత్రిపూట గస్తీ […]

Continue Reading

తల్లి ప్రేమ లేక ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య

_సూసైడ్ నోట్ లో స్పష్టంగా తెలిపిన అన్నదమ్ములు యాదిరెడ్డి , మహిపాల్ రెడ్డి లు మనవార్తలు ,మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం , అమ్మ ప్రేమ లేదని తమ చావుకు ఎవరు కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి 34 సం”లు, మహిపాల్ రెడ్డి 29 సం”లు రాంపల్లి దాయరా గ్రామానికి చెందిన యాదిరెడ్డి అతని తమ్ముడు మహిపాల్ రెడ్డి లు గత 9 నెలల క్రితం […]

Continue Reading

అగ్నికి ఆహుతైన పోలీస్ శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనం

మనవార్తలు ,నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనం పెట్రో కార్ అగ్నికి ఆహుతి అయింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. నగరంలోని ఫస్ట్ టౌన్ పోలిస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ మొబైల్ కార్‌కు నగరంలో దర్నా చౌక్‌లో మంటలు అంటుకుని కాలిపోయింది. అప్పుడు దానిని హెడ్ కానిస్టేబుల్ పర్వేజ్ నడుపుతుండగా, మహిళ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంజీవ రావు అందులో ఉన్నారు. కారు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అగ్నికిలలకు […]

Continue Reading

హత్య కేసును 48 గంటల్లో ఛేదించిన పటాన్ చెరు పోలీసులు

రాజునాయక్ హత్యకు భూ వివాదాలే కారణం _డీఎస్పీ భీంరెడ్డి మనవార్తలు , పటాన్ చెరు వెలిమెల హత్య కేసులో మిస్టరీ వీడింది. భూ వివాదాలే కారణమని పోలీసులు నిగ్గుతేల్చారు. ఈ మేరకు పటాన్ చెరు డీఎస్పీభీంరెడ్డి పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హత్య వివరాలను వెల్లడించారు. దారుణ హత్యకు గురైన రాజునాయక్ పెదనాన్న కుమారుడు రాంసింగ్ ఈ హత్యకు కీలకమని డీఎస్పీ వెల్లడించారు. ఇటీవల వెలమల తాండాలో కొంతమంది భూములను విక్రయించగా […]

Continue Reading

పసికందును చంపిన తల్లి! పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏఎన్ఎం

మన వార్తలు , గుంటూరు పుట్టి వారం రోజులైనా కాని పసికందును కన్న తల్లే కర్కశంగా చంపేసింది. ఈ హృదయవిదారక ఘటన గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో బుధవారం వెలుగు చూసిం ది. దీనిపై ఏఎన్ఎం ఎం.స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కథనం ప్రకారం రావెలకు చెందిన బొంతా లక్ష్మి ఈనెల 2న గుంటూరు జీజీహెచ్ లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. గత సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఆ రోజు వైద్యసిబ్బంది […]

Continue Reading

కల్తీ టీపొడి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు

మనవార్తలు ,విజయవాడ: పదేళ్లుగా కల్తీ టీపొడి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సూర్యాపేటతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం, విజయవాడ ప్రాంతాల్లో మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించి రూ.22.5లక్షల విలువైన 45.5 క్వింటాళ్ల కల్తీ టీపొడి, 50 కిలోల ప్రమాదకర రసాయన రంగు పొడిని స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేటకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 8 మంది పరారీలో ఉన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మంగళవారం […]

Continue Reading