– గీతం విద్యార్థులకు టెమ్ నిపుణుడు ఉద్ఘాటన
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
ప్రణాళికబద్ధంగా సన్నద్ధమైతే , ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ( ఐఐఎం ) లలో ప్రవేశం పొందడానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ( క్యాట్ ) పరీక్షలో నెగ్గడం పెద్ద కష్టమేమీ కాదని ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి , టెమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన రామ్‌నాథ్ స్పష్టీకరించారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ లో ‘ క్యాట్ , జీమ్యాట్ ద్వారా కెరీర్ అవకాశాలు ‘ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన సెమినార్లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు . టెమ్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో గీతం కెరీర్ గెడైన్స్ సెంటర్ ( జీసీజీసీ ) ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ , క్యాట్‌కు పోటీ అధికమని , దాదాపు మూడువేల సీట్లకు రెండున్నర లక్షల మంది పోటీపడతారని చెప్పారు . ఒక్క ప్రశ్నకు సరయిన జవాబు రాయడం ద్వారా మూడు వేల మంది పోటీని అధిగమించవచ్చన్నారు . ప్రతియేటా ఒకసారి మాత్రమే ( నవంబర్‌లో ) నిర్వహించే ఈ పరీక్షలో సరైన జవాబుకు మూడు మార్కులు , ప్రతికూల సమాధానానికి మెన్షస్ ఒక మార్కు ఉంటుందని చెప్పారు . 99 శాతం పర్సంటెల్ సాధించాలనుకునేవారు సులువెన ప్రశ్నలను వేగంగా పూర్తిచేయడంతో పాటు కఠిన ప్రశ్నలను కూడా పరిష్కరించే ప్రయత్నం చేయాలని సూచించారు .
మూడు విభాగాలలో ఇచ్చే సంక్లిష్ట ప్రశ్నలను వేగంగా పరిష్కరించడం కఠోర సాధనతోనే సాధ్యమన్నారు . దేశంలో ఉన్న 21 ఐఐఎంలతో పాటు ఎఫ్ఎస్ , ఎస్ఎల్ఆర్ఎస్ఐ , ఎస్పీ జెన్ , ఏబీఐఎంఎస్ , ప్రసిద్ధ బీ – స్కూల్స్ వంటి అత్యుత్తమ విద్యా సంస్థలలో ఎంబీఏ చేయడం మంచిదని రామ్‌నాథ్ సూచించారు . డిగ్రీ పూర్తయిన వెంటనే ఎంబీఏ చేయడం ఉత్తమమని , ఒకటి రెండేళ్ళు ఉద్యోగం చేశాక ఎంబీఏను చదవడం వల్ల వచ్చే ప్రయోజనాలు పెద్దగా ఏమీ ఉండవన్నారు . క్షుణ్ణమైన జ్ఞానం , మంచి పఠన వేగం , శీఘ్ర మానసిక గణన , అన్నిరకాల ప్రశ్నలతో పరిచయడం కలిగి ఉండడం ద్వారా క్యాట్‌ను సులభంగా ఛేదించవచ్చని రామ్‌నాథ్ స్పష్టీకరించారు . క్యాట్‌తో పాటు జీమ్యాట్ గురించి కూడా టెమ్ బృందం గీతం విద్యార్థులకు మార్గదర్శనం చేసింది . జీసీజీసీ శిక్షణాధికారి బి.సంతోష్‌కుమార్ వందన సమర్పణతో ఈ సెమినార్ ముగిసింది .