ఢిల్లీ రాజకీయాలు పక్కనపెట్టి ముందు ధాన్యం కొనండి

Districts politics Telangana

ప్రభుత్వం తీరుపై షాద్ నగర్ బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి ఆగ్రహం

మనవార్తలు ,షాద్ నగర్

షాద్ నగర్ మార్కెట్ యార్డును పరిశీలించిన బీజేపీ బృందంవర్షా కాలం పంట వచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ధాన్యం కొనే దిక్కులేకుండా పోయిందని, ధాన్యం కొనమంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలు చేస్తున్నారని ముందు టిఆర్ఎస్ రాజకీయాలు పక్కనపెట్టి ముందు రైతుల నుంచి ధాన్యం కొనాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

మంగళవారం షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డును బిజెపి బృందం సభ్యుల ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం వచ్చి నెల రోజులు గడుస్తున్నాయని మార్కెట్ కు ధాన్యం వస్తుంటే కొనలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందు వడ్లు కనుగొలు చేయకుండా రాజకీయ పబ్బం గడుపుకోవాలని కెసిఆర్ ఢిల్లీ వెళ్లారని తీవ్రంగా విమర్శించారు. రాజకీయాలు ఉంటె వాటిని పక్కన పెట్టాలని ముందు రైతు వద్ద ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు.

60 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ప్రభుత్వం మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసం సమయాన్ని వృధా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నడిరోడ్డులో పెట్టి టిఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తగలక మానదని శాపనార్థాలు పెట్టారు. గత ఆరు నెలలుగా రాష్ట్రాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికలను ఆసరా చేసుకొని రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. హుజరాబాద్ తీర్పు వచ్చాక కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని దెప్పి పొడిచారు.ఇప్పుడు ప్రభుత్వం ప్రతి గింజను కొని తీరాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 6500 కొనుగోలు కేంద్రాలు అవసరం ఉంటే కనీసం పాతిక కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్రంలో లేవని విమర్శించారు. దిగుమతి అయిన ధాన్యంతో రైతులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ధాన్యం సేకరించ కపోతే ఆందోళన తీవ్రం కాక తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలుఅందే బాబయ్య, సీనియర్ నాయకుడు భూపాలచారి, వెంకటేశ్వర్ రెడ్డి,వెంకటేష్ గుప్తా, మోటే శ్రీనివాస్, మధుసుధన్ గౌడ్, వంశీకృష్ణ, మల్చాలం మురళి, చెట్ల వెంకటేష్, ఎంకనోళ్ల వెంకటేష్, ప్యాట అశోక్ ,శేగు శ్రీనివాస్, లాస్కర్ నాయక్, వినోద్ కుమార్, నర్సింలు యాదవ్, డోడల వెంకటేష్, ఋషికేష్, శ్యామ్ సుందర్ రెడ్డి, మధు సుధన్ రెడ్డి, పిట్టల సురేష్,శివ కృష్ణ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *