పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని హారిక బూర్గుల డాక్టరేట్ కు అర్హత సాధించారు. హైబ్రిడ్ నియర్ ఆల్జీబ్రా, న్యూట్రోసోఫిక్ నియర్ ఆల్జీబ్రాలోని కొన్ని అంశాలపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.నరసింహ స్వామి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.డాక్టర్ హారిక చేసిన అత్యుత్తమ పరిశోధన ఈ రంగానికి విలువైన అంతర్దృష్టులను జోడిస్తుందని, గణిత శాస్త్రాల పురోగతికి గణనీయంగా దోహదపడుతుందని తెలిపారు. ఆమె సూక్ష్మమైన పని బీజగణిత నిర్మాణాల రంగంలో మరింత అన్వేషణ, అనువర్తనానికి కొత్త మార్గాలను తెరుస్తుందన్నారు.డాక్టర్ హారిక సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.గీతం విద్యా నైపుణ్యాన్ని పెంపొందించి, మద్దతు ఇవ్వడమే గాక, జ్జానం, ఆవిష్కరణల వృద్ధికి దోహదపడే పరిశోధనలను ప్రోత్సహిస్తోందని తెలియజేశారు.
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…
మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : రాయదుర్గం, దర్గా, మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎ. భరత్ కుమార్ గౌడ్ గచ్చిబౌలి డివిజన్…
మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : ఎన్ఎంజి చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు హఫీజ్ పేట్ డివిజన్ యువనాయకుడు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్…
– చట్టపరంగా ధీటుగా ఎదుర్కొంటాo - బీఆర్‌ఎస్! మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : తమ పై ఎన్ని కేసులు పెట్టి…
భద్రతే మొదటి ప్రాధాన్యం అవగాహన – భాగస్వామ్యం – సాధికారత”తో ఉద్యోగుల్లో భద్రతా చైతన్యం పెంపు ప్రతి పనిదినం భద్రతతోనే…