రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పటాన్చెరు పట్టణంలో వ్యాపారస్తులకు, స్థానికులకు నష్టం వాటిల్లకుండా ఫ్లై ఓవర్ నిర్మించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ మధుసూదన్ రెడ్డికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాదులోని ఆర్ అండ్ బి. కార్యాలయంలో. సీఈ మధుసూదన్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం లో చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.మియాపూర్ నుండి పటాన్చెరు వరకు చేపడుతున్న ఆరు వరసల జాతీయ రహదారి విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో.. విస్తరణ మూలంగా పటాన్చెరువు పట్టణంలో వ్యాపార సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఇది అంశంపై అప్పటి సీఈ గణపతి రెడ్డికి సైతం విజ్ఞాపన పత్రాన్ని అందించడంతోపాటు, పటాన్చెరు పట్టణంలో స్వయంగా పర్యటించడం జరిగిందని తెలిపారు. రహదారి విస్తరణ మూలంగా వ్యాపారస్తులకు, స్థానికులకు నష్టం కలగకుండా ఫ్లై ఓవర్ నిర్మించాలని కోరారు. ఎందుకు సానుకూలంగా స్పందించిన సీఈ మధుసూదన్ రెడ్డి.. ఈ అంశాన్ని జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి. నితిన్ గడ్కారీ దృష్టికి తీసుకొని వెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే జిఎంఆర్ వెంట పటాన్చెరు పట్టణానికి సంబంధించిన వ్యాపారస్తులు పాల్గొన్నారు.