మనవార్తలు ,పటాన్ చెరు:
ఫార్మశీ విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణలో తమకున్న జ్ఞానాన్ని సమాజానికి పంచి , ప్రజలను చైతన్య వంతులుగా చేయాలని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ పిలుపునిచ్చారు . గీతం ఫార్మశీ విద్యార్థుల సంఘాన్ని ( జీపీఎస్ఏ ) గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ , ఆరోగ్య పరిరక్షణ , పరిశుభ్రత , ఔషధ వినియోగం , వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు వంటి విషయాలను ఫార్మశీ విద్యార్థులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు . గీతం ప్రాంగణం చుట్టుపక్కలున్న పాఠశాలలు , గ్రామాలకు వెళ్లి , అక్కడి విద్యార్థుల , గ్రామీణుల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవాలని , పలు వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజెప్పి , వారిని చెత్తన్య చేయాలన్నారు . అలాగే సమాజాన్ని పట్టి పీడిస్తూ , ప్రజల ఆర్థిక స్థితిని దిగజారుస్తున్న క్యాన్సర్ ప్రబలడానికి కారణాలు , నివారణా చర్యలపై కూడా ప్రజలకు అవగాహన కలుచేయాలని , కరోనా వ్యాక్సిన్లో ఉన్న అపోహలను తొలగించాలని ఫార్మశీ విద్యార్థులకు సలహా ఇచ్చారు .
నేడు విద్యార్థి సంఘంగా ప్రారంభమైన ఈ జీపీఎస్ఏ మంచి కార్యక్రమాలను చేపట్టి , త్వరలోనే ఓ విద్యార్థి క్లబ్ గా ఎదగాలని ఆయన ఆకాక్షించారు . లు వివిధ ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమ , ఆరోగ్య అంశాలపై చర్చలకు జీపీఎస్ఏ ఓ వేదికగా తోడ్పడుతుందని దాని వ్యవస్థాపకుడు , టాంజానియా దేశానికి చెందిన గీతం ఫార్మశీ విద్యార్థి శివం ఏ.పర్మర్ పేర్కొన్నారు . ఈ వేదికను నెలకొల్పడానికి గల కారణాలను , దాని నేపథ్యాన్ని శివం వివరించారు . కోవిడ్ వ్యాక్సిన్ప_అపోహలు – వాస్తవాలను ఫార్మశీ మూడు ఏడాది విద్యార్థిని ఆర్.నితీషా సిమ్రాన్ తెలియజేశారు . క్యాన్సర్ కారకాలు , నివారణ చర్యలపై ప్రతిభ ; యాంటీబయాటిక్స్ వినాయోగం – తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫార్మశీ తొలి ఏడాది విద్యార్థి విఘ్నేష్ , వీథుల వెంట నిరుపేదల జీవనంపై పైస్ట్రా తబస్సుమ్ు వివరించారు . డాక్టర్ సి.పవన్ కుమార్ , డాక్టర్ జితేంద్ర పాటిల్ జీఈపీఎస్ఏఏ ప్రాముఖ్యతను తెలియజేశారు . చివరగా డాక్టర్ రాకేష్ బారిక్ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…