దేశ భక్తిని ఘనంగా చాటేందుకే గణతంత్ర దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

74వ జాతీయ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని.పటాన్ చెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామ పంచాయితీలో గణతంత్ర వేడుకల్లో  పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ గ్రామంలో ఎస్సీ కాలనీ,ముదిరాజ్ కాలనీ,ప్రాథమిక పాఠశాల ,అంగన్వాడి కేంద్రం, రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు గణతంత్ర స్పూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారుజనవరి 26న, భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని చాలా వైభవంగా, ఉత్సాహంతో జరుపుకుంటున్నామన్నారు. 1950లో జనవరి 26న భారత రాజ్యాంగం ఆమోదం పొందిందని భారతదేశం 1947లో వలస పాలన నుండి స్వాతంత్య్రం పొందినప్పటికీ, జనవరి 26, 1950 వరకు భారత రాజ్యాంగం అమలులోకి రాలేదని గుర్తు చేశారు. భారతదేశం తన స్వంత రాజ్యాంగం కలిగిన ఒక సార్వభౌమ రాజ్యంగా అవతరించిందన్నారు. అప్పటి నుంచి ఒక ప్రజాపరిపాలన వ్యవస్థ కలిగిన గణతంత్ర దేశంగా భారతదేశం తనని తాను ప్రకటించుకుందని గుర్తు చేశారు .ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగి ఉన్న ఏకైక దేశం భారతదేశం అని దేశ ఐక్యతను చాటుతూ ప్రతిఒక్కరూ గణతంత్ర వేడుకలను జరపుకోవాలని నీలం మధు ముదిరాజ్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈఓ కవిత, ఎంపీటీసీలు మాధవి రెడ్డి,మంజుల, ఉప సర్పంచ్ విష్ణువర్థన్ రెడ్డి,వార్డు సభ్యులు దుర్గయ్య, కృష్ణ , వెంకటేశ్ , భుజంగం,శ్రీను ,మురళీ,రాజ్ కుమార్, వెంకటేశ్, యాదగిరి ,నర్సింగ్,ఆంజనేయులు, ఆశ వర్కర్లు, ఉపాధ్యాయులు,విద్యార్థులు,గ్రామ పెద్దలు, యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *