Telangana

ఇంద్రేశం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బిఆర్ఎస్

నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ 

నూతన చైర్మన్ గా కుశంగుల ప్రమీల , వైస్ చైర్మన్ గా పట్లోళ్ల హరీష్ రెడ్డి 

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి నాయకత్వంలో పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి నేతృత్వంలో పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీని బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మంగళవారం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంబండ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ కి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ కుశంగుల ప్రమీల చైర్మన్ గా, బిఆర్ఎస్ పార్టీకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల హరీష్ రెడ్డి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పరిపాలన అందించాలని ఆయన కోరారు. మున్సిపాల్టీల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

2 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

4 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago