నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
నూతన చైర్మన్ గా కుశంగుల ప్రమీల , వైస్ చైర్మన్ గా పట్లోళ్ల హరీష్ రెడ్డి
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి నాయకత్వంలో పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి నేతృత్వంలో పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీని బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మంగళవారం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంబండ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ కి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ కుశంగుల ప్రమీల చైర్మన్ గా, బిఆర్ఎస్ పార్టీకి చెందిన 12వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల హరీష్ రెడ్డి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడంతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పరిపాలన అందించాలని ఆయన కోరారు. మున్సిపాల్టీల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
