_’హవానా’ ప్రారంభోత్సవంలో పిలుపునిచ్చిన బీఎస్ఎన్ఎన్ జీఎం రాజేశ్వరి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
టెలి కమ్యూనికేషన్స్ రంగంలో 5జీ సాంకేతికతను అమలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో స్టార్ట్ ప్ లను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని వర్ధమాన ఇంజనీర్లకు సంగారెడ్డిలోని భారతీయ పంచార విగం (బీఎస్ఎన్ఎల్) ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ డి.రాజరాజేశ్వరి పిలుపునిచ్చారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం అధ్వర్యంలో ‘హవానా’ పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సాంకేతికోత్సవాన్ని గురువారం జ్యోతి ప్రజ్వలనతో ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ లో తన ఇరవై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం, అందులో సాంకేతిక పరిజ్ఞానం ఎదిగిన తీరును రాజేశ్వరి వివరించారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేది ఇంజనీర్లని ఎట్ ఏఐ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి గంగాధర్ గుడే అన్నారు. మనదేశం నుంచి వస్తున్న ఆవిష్కరణలు, వ్యవస్థాపకరను ఆయన బహుదా ప్రశంసించారు. ఈ రెండు రోజుల సాంకేతికోత్సవం విద్యార్థులలో మరిన్ని ఆలోచలను, సృజనాత్మకతను ప్రేరేపిస్తుందన్న విశ్వాసం వ్యక్తపరిచారు.
సాంకేతికత యొక్క ఆచరణాత్మక అనుభవ ఆవశ్యకతను ఫీనిక్స్ గ్లోబల్ సహ వ్యవస్థాపకుడు అయుష్ గోస్వామి నొక్కి చెప్పారు. విభిన్న నెపుణ్యాలు, జ్ఞానాన్ని పొందడం ద్వారా విద్యార్థులు తను పరిధులను విస్తృతం చేసుకోవాలని కోరారు. ఇంజనీరింగ్ రంగంలో మంచి భావ ప్రకటనా నైపుణ్యం, వ్యాపార చతురత అవసరమని స్పష్టీకరించారు. వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా విద్యార్థులను ఆహ్వానిస్తూ గీతమ్ లో పెద్దయెత్తున సాంకేతికోత్సవాన్ని నిర్వహించడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు గీతం కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి ప్రకటించారు. ఇటీవల భారత నౌకదళంతో గీతం అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుందని, త్వరలో భారతీయ వాయుసేనతో కూడా అవగాహన ఒప్పందంపై సంతకం చేయబోతున్నట్టు ఆయన తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి పలు రంగాలలో కొత్త కోర్సులను గీతమ్ లో ప్రారంభించబోతున్నట్టు ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి. మాధవి చెప్పారు. ‘హవానా’ నిర్వాహకుడు ఎం. నరేష్ కుమార్ ఆర్ధిక సౌజన్యం అందజేసిన, ఇందులో పాల్గొంటున్న విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రెండు రోజుల సాంకేతికోత్సవంలో రోబో లేస్, ఇ-స్పోర్ట్స్, హ్యాకథాన్ వంటి వినిధి సాంకేతిక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో దేశ నలుమూలలకు చెందిన 30 కళాశాలల నుంచి దాదాపు 250 నుంది విద్యార్థులు పాల్గొంటున్నట్టు ఆయన చెప్పాడు. ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , విద్యార్థి విభాగం జీ-ఎలక్ట్రా అధ్యక్ష, ఉపాధ్యక్షులు పి.దీపక్, అమూల్య, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.