లంచం కొట్టు అదనపు అంతస్థులు కట్టు

Hyderabad politics Telangana

_శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్ లలో జోరుగా అక్రమ నిర్మాణాలు

– అక్రమ నిర్మాణదారులకు కొమ్ముకాస్తున్న అధికారి, చైన్ మెన్ లు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :

కంచే చేను మేసిన చందంగా అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన అధికారే అండగా నిలబడి ప్రోత్సహిస్తున్నాడు. ప్రభుత్వ అందయానికి గండీ కొడుతూ అందినకాడికి దండుకొంటున్నాడనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గల శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్ ల పరిధిలోని శ్రీరామ్ నగర్ ఎ, బి, సి, బ్లాకుల్లోను, రాఘవేంద్ర, రాజరాజేశ్వరి కాలనిల్లో కేవలం రెండు, మూడు అంతస్థులకు అనుమతులు తీసుకొని నాలుగు, నుండి ఏడు ఆ పైన పెంట్ హౌస్ లు నిర్మిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్న అక్రమ నిర్మాణం దారుల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. వీటిని నిర్మూలిoచాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారి, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే చైన్ మెన్లు లక్షల రూపాయల లంచం పుచ్చుకొని అండగా నిలుస్తున్నారనే ఆరోపణలున్నాయి. సర్కిల్ మొత్తానికి ఒక్కరే సెక్షన్ అధికారం ఉండడంతో చైన్ మెన్లు కలిసి లంచాలకు తెరలేపి అక్రమ నిర్మాణాలకు వంతపాడుతూ లక్షలు వెనుకేసుకుంటూ ప్రభుత్వ ఆధాయానికి గండి కొడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.

చర్యలు తీసుకుంటారా ?

ఈ వ్యవహారం పై ద్రుష్టి సారించిన జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం రోజు నోడల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తక్షణమే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అదేశించారు. కానీ ముందే ముడుపులు పుచ్చుకున్న అవినీతి అధికారులు అందరిపై చర్యలు తీసుకుంటారా లేకపోతే బడా బాబులను వదిలేసి చిన్న, చిన్న వారిపై తూ తూ మంటూ కంటి తుడుపు చర్యలతో సరిపెడతారా అనేది వేచి చూడాలి అంటున్నారు స్థానికులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *