మనవార్తలు ,హైదరాబాద్:
హైదరాబాద్ మహానగరం త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్ కేంద్ర మారుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన నగరమన్నారు. మెరుగైన మౌళిక వసతులు..పటిష్టమైన శాంతిభద్రతలతో పాటు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం కారణంగా అనేక సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
మాదాపూర్ లో ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ అండ్ టెక్నాలజీ కంపనీ సవర్ట్ ప్రధాన కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్ని ప్రారంభించారు. ప్రత్యేక రాష్టం ఏర్పాటైన తర్వాత టీఎస్ ఐపాస్ లాంటి విధానాలను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సహకారం అందిస్తోందన్నారు.
అంతర్జాతీయంగా పేరొందిన బహుళ జాతి కంపనీలు హైదరాబాద్ లో తమ కార్యాలయాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతాయన్నారు. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా కారణంగా వ్యవసాయంతో పాటు పారిశ్రామికరంగాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఒక చిన్న కంపెనీ ప్రారంభమై నేడు దేశంలోనే ఒక ప్రముఖ కంపెనీగా మారిందని సవర్ట్ కంపెనీ వ్యవస్థాపకులు సంకర్షచంద్రా అన్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గ్లోబల్ విస్తరణ కోసం ప్రణాళికలను ఆయన ప్రకటించారు. త్వరలోనే కెనాడ, జర్మనీ వంటి దేశాల్లో సైతం తమ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వినోద్‌కుమార్, సంస్థ వ్యవస్థాపకులు సంకర్ష్ చంద్రాతో పాటు కంపెనీ ప్రతినిధులు, ఇన్వెస్లర్లు పాల్గొన్నారు.