ఓయూలో గీతం అధ్యాపకుడి పుస్తకావిష్కరణ

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జె.డి.ప్రభాకర్ పరిశోధనా పుస్తకం ‘భారతీయ భాషల సామాజిక-ఆర్థిక ఆకృతి’ని ఆవిష్కరించినట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని భాషాశాస్త్ర విభాగం నిర్వహించిన ప్రతిష్టాత్మక 13వ అంతర్జాతీయ తెలుగు భాషాశాస్త్ర సదస్సులో, భారత భాషాశాస్త్ర పండితుల సంఘం పూర్వ అధ్యక్షుడు ప్రొఫెసర్ గారపాటి ఉమామహేశ్వరరావు, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, భారతీయ భాషల కేంద్ర సంస్థ అధ్యక్షుడు మాధభూషి సంపత్ కుమార్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్టు తెలియజేశారు.జర్మనీలోని ప్రఖ్యాత ప్రచురణల సంస్థ లింకం GmbH యూరోపా ప్రచురించిన ఈ పుస్తకం అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, ఇటీవల హైడెల్ బర్గ్ విశ్వవిద్యాలయ గ్రంథాలయం, జర్మనీలోని పలు జాతీయ గ్రంథాలయాలో దీనిని ప్రతులను ఉంచినట్టు వివరించారు.భారతీయ భాషల సామాజిక-ఆర్థిక ప్రొఫైలింగ్, సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో భాష పోషించే కీలక పాత్రను ఈ పుస్తకం అన్వేషిస్తుందన్నారు. లోతైన పరిశోధన, గణాంక విశ్లేషణ ద్వారా, ఆధునిక సమాజాలలో ఆర్థిక వృద్ధికి భాష ఎలా కీలకమైన చోదకంగా పనిచేస్తుందో రచయిత వివరించినట్టు తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు, సంపద ఉత్పత్తిని మెరుగుపరచడానికి స్థానిక భాషలను పారిశ్రామిక రంగాలలో అనుసంధానించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, భాష, ఆర్థిక వ్యవస్థల మధ్య లోతైన సంబంధాన్ని ఈ అధ్యయనం ప్రస్ఫుటీకరించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *