మనవార్తలు , శేరిలింగంపల్లి :
ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ నడిగడ్డ తాండ లో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించిన కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర నాయకురాలు కసిరెడ్డి సింధు రెడ్డి బోనం ఎత్తుకొని మహిళా భక్తులతో పాటు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ కోలాహలం పోతరాజుల నృత్యాలు డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో పాటు బోనాల ఉత్సవాలు నడిగడ్డ తండ, మియాపూర్ మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా భారీ కోలాహలం పోతరాజుల నృత్యాలు డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో పాటు రఘునాథ్ రెడ్డి, ఎడ్ల ఆంజనేయులు చందు, వంశీధర్ రెడ్డి, శివ రత్నాకర్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు