శ్రీనిధి గ్లోబల్ స్కూల్ లో బోనాల సందడి

Hyderabad politics Telangana

మనవార్తలు , శేరిలింగంపల్లి :

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమైన బోనాల పండుగను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలని స్కూల్ సిబ్బంది భావిస్తూ ఆ దిశగా పిల్లల్లో పండుగల ఔనత్యాన్ని తెలియజేస్తున్నారు. అందులో భాగంగా శేరిలింగంపల్లి మండల పరిధిలో గల కొండాపూర్ డివిజన్ లని రాఘవేంద్ర కాలనీ లోని శ్రీనిధి గ్లోబల్ ఒలంపియాడ్ పాఠశాలలో శనివారం రోజు ఘనంగా బోనాల పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేకంగా బోనాలను తయారు చేసి ఆటపాటలతో విద్యార్థులు,ఉపాధ్యాయులు సందడి చేసారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నల్లపాటి వెంకటేశ్వర్ రావు,ఎన్,రాజేశ్వరి, ప్రధానోపాధ్యాయులు క్రాంతి, పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *