గీతమ్ లో రక్తదాన శిబిరం

Telangana

– 180 యూనిట్ల రక్తాన్ని దానం చేసిన విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని పరిస్థితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసెట్టీ, తలసీమియా టాస్క్ ఫోర్స్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్ల సహకారంతో అత్యంత విజయవంతంగా నిర్వహించి ఈ శిబిరంలో రక్తదానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడమే గాక అది జీవితాలను రక్షించడంలో చూపే ప్రభావాన్ని తెలియజేశారు.రక్తం దానం చేయడం వల్ల పెద్ద మార్పు వస్తుంది, ఇతరులకు జీవితాన్ని బహుమతిగా ఇవ్వండి’ అనే ఇతివృత్తంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి విద్యార్థులు, సిబ్బంది నుంచి విశేష స్పందన లభించింది. సమాజానికి వారు చేస్తున్న సేవ, దాని ప్రాముఖ్యతల గురించి వారికి అవగాహన కల్పించారు.గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ మాట్లాడుతూ, రక్తదాన శిబిరం నిర్వహణలో చరక్షేతి విద్యార్థులు చేస్తున్న కృషి, వారి చొరవలను అభినందించారు. స్వచ్ఛంద దాతలను ఇలాంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడమే గాక, క్రమం తప్పకుండా రక్తదానం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.

రక్తదానం వల్ల దాత, గ్రహీత ఇద్దరికీ కలిగే ప్రయోజనాలను సంగారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.వనజారెడ్డి తెలియజేశారు. హెచ్డీఎఫేసీ బ్యాంక్ మేనేజర్ (సీఎంఎస్) ఎం.పాండురంగ వికల్, డాక్టర్ కేసిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కె.శిల్లేష్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ కార్యక్రమానికి తను సుద్దతును తెలియజేశారు.రెడ్ క్రాస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ శిబిరంలో సుమారు 180 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్టు చెప్పారు. రక్తదానం అనేది మరొక వ్యక్తికి ఇవ్వగల అత్యంత విలువైన జీవిత బహుమతిగా వారు అభివర్ణించారు. తాము. సేకరించిన రక్తాన్ని ఎర్ర కణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మాగా వేరుచేసి నిర్దిష్ట పరిస్థితులలో అయా రోగులకు చికిత్స చేయడానికి వ్యక్తిగతంగా ఉపయోగించవచ్చని, పలువురి జీవితాలను కాపాడవచ్చన్నారు.ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం గర్వంగా ఉందని, సహకరించిన విద్యార్థులు, సిబ్బంది, ఇతర సంస్థలకు చరినైతి విభాగం ధన్యవాదాలు తెలియజేసింది. మాననతా కారణాలను ప్రోత్సహించడానికి, సమాజంలో మార్పు: తీసుకురావడంలో భాగంగా, విద్యార్థులను ప్రేరేపించడానికి తాము కట్టుబడి ఉన్నానున్నారు.

ఖాదీ మహోత్సవ్

గీతన్లోని జాతీయ సేవా పథకం (ఎన్ఎఎస్ఎస్) ఆధ్వర్యంలో ‘ఖాదీ మహోత్సవ ‘ను, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల, మండలి, ఎంఎస్ఎంఈ సహకారంతో ఘనంగా నిర్వహించారు. యువతను భారీ నోకల్ ఫర్ లోకల్’ పట్ల చెతన్యవంతం చేయడం, మన ఆర్థిక వ్యవస్థ, జీవావరణ శాస్త్రం, మహిళా సాధికారతకు నీటివల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడం, ఖాదీ వస్తువులను కొనుగోలు చేసేలా యుతను ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించారు.డీవీవీఎస్ఆర్ వర్మ, రెసిడెంట్ డెరెక్టర్, ఎన్ఎఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ సీవీ నాగేంద్రకుమార్, జియో సిరిల్, అసిస్టెంట్ డెరైక్టర్, స్టూడెంట్ లెస్ట్, కేవీఐసీ, కేవిఐలీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *