మనవార్తలు ,శేరిలింగంపల్లి :
తమకున్న దాంట్లో పేదలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన పోల రంగనాయకమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు చందానగర్ లోని సాయిబాబా దేవాలయం వద్ద ఉన్న యాచకులకు ట్రస్ట్ సభ్యులు దుప్పట్లు పంపిణీ చేశారు. కరోనా, లాక్ డౌన్ సమయంలో కూడా పేదలకు అనేక సేవాకార్యక్రమాలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు కూడా పేదలకు సహాయం చేయడానికి ముందుకు రావాలని పలువు కోరుతున్నారు.