_పార్టీ బలోపేతానికి అందరం కలిసి పనిచేద్దామని యోగానంద్ పిలుపు
మనవార్తలు , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బీజేపీ పార్టీ బలోపేతానికి మసనమంధరo కలిసికట్టుగా పనిచేద్దామని శేరిలింగంపల్లి నియోజకవర్గo ఇంచార్జి, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి గజ్జల యోగానంద్ అన్నారు. హఫిజ్ పేట్ మరియు మియాపూర్ డివిజన్ ల సంయుక్త కార్యాలయం డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, మాణిక్ రావు ఆధ్వర్యంలో మియాపూర్ జాతీయ రహదారి పక్కన పార్టీ కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు అధికార ప్రతినిధి నరేష్ తో కలిసి శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగజ్జల యోగానంద్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా గజ్జల యోగానంద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా పార్టీ కార్యాలయంకి విచ్చేసి సమస్యలు తెలియజేసిన యెడల సమస్యలును పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే పార్టీ బలోపేతం దిశగా పని చేయాలని. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, బుచ్చిరెడ్డి, వినయ, కాంచన కృష్ణ, నాగేశ్వర్ గౌడ్, వెలగ శ్రీనివాస్, అనిల్ గౌడ్, జితేందర్, రత్నాకర్, రాష్ట్ర మరియు జిల్లా బీజేపీ నాయకులు అన్ని డివిజన్ ల అధ్యక్షులు అన్ని మోర్చా ల అధ్యక్షులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
