మనవార్తలు ,హైదరాబాద్:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికైన తరువాత తొలిసారి తెలంగాణ కు విచ్చేసిన బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ గారికి స్వాగతం పలికిన అనంతరం వారిని ఘనంగా సన్మానించిన పటాన్చెరు మాజీ జెడ్పిటిసి బిజెపి ఓబిసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ , తెలంగాణలో అధికారంలోకి రావడమే పార్టీ లక్ష్యంగా తెలంగాణలో విజయం బీజేపీదే అని ప్రజలు భావించేలా నేతలు జనంలోకి వెళ్లాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం స్థానిక నేతలకు సూచించింది. అందుకే తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్‌కు ఆ పార్టీ కీలక అవకాశం కల్పించింది. లక్ష్మణ్‌ను రాజ్యసభకు ఎంపిక చేసింది. యూపీ నుంచి మొత్తం 8 సీట్లు బీజేపీకి దక్కనుండగా.. అందులో లక్ష్మణ్‌ను ఒకరిగా ఎంపిక చేయడం విశేషం. దీనిని బట్టి తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ఎంతగా ఫోకస్ పెట్టిందో అర్ధం చేసుకోవచ్చు.