బీజేపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి నేతలు

politics Telangana

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

గచ్చిబౌలి డివిజన్ , గోపనపల్లీ తాండా లో హనుమత్ నాయక్ ఆధ్వర్యంలో నూతనoగా ఏర్పాటు చేసిన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి,కసిరెడ్డి భాస్కర్ రెడ్డి,రాధాకృష్ణ యాదవ్ల్ లతో బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గోపనపల్లి తాండా వాసులకు అందుబాటులో ఉండేలా కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయమన్నారు, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని కొనియాడారు, ఈ బి.ఆర్.ఎస్ నాయకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని , వారి అవినీతిని ప్రజలలోకి తీసుకెళ్లి అర్థం అయ్యేలా చెప్పాలని సూచించారు. ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయి లో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలన్నారు, ఈ కార్యక్రమం లో కృష్ణ ముదిరాజ్ ,లక్ష్మి నాయక్, రంగస్వామి,జగదీష్, రమేష్, శ్రీరామ్ నాయక్, రాజ్ కుమార్ నాయక్, బాబు నాయక్, మహిళా నాయకులు మహేశ్వరి, ఇందిర ,సుజాత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *