పటాన్ చెరు:
సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సమావేశానికి బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బుధవారం పటాన్ చెరు మండలం ముత్తంగి బీజేపీ కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మధురి ఆనంద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ జిల్లా కార్యవర్గ సమావేశానికి వచ్చిన మహిళలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు.
జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో బీజేపీ పార్టీ బలపడానికి మన మహిళా కార్యకర్తలు గడప గడపకు తిరుగుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్ద వివరిస్తూ పార్టీని చాలా బలోపేతంగా పటిష్ఠంగా చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని తెలిపారు. రాబోయే రోజులలో 2023 లో తెలంగాణలో ఉన్న నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిపించుకొని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి బీజేపీ అధ్యక్షుడు ఎలవర్తి ఈశ్వరయ్య, నాయకులు కోళ్లసుజాత, గడ్డ పుణ్యవతి, అనిత, అనూష, అనిత, ఝాన్సీరాణి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.