_విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, గూడెం కల్పనా మధుసూదన్ రెడ్డి
మనవార్తలు , అమీన్పూర్:
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను జిఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మహిమ మినిస్ట్రీస్ అనాధ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులందరికీ స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా యాదమ్మ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ అనాధ విద్యార్థుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆశ్రమం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.