Telangana

గీతమ్ లో ఘనంగా బయో – ఎంజెమ్ దినోత్సవం

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం ‘ ప్రపంచ బయో – ఎంజెమ్ దినోత్సవాన్ని ‘ ఘనంగా నిర్వహించారు . భారతీయ మహిళా ఛాంబర్ ఆఫ్ కామర్స్ , ఇండస్ట్రీ ( డబ్ల్యూఐసీసీఐ ) , హెదరాబాద్ లోని బయో – ఎంజెమ్ కౌన్సిల్ , భారతీయ బయో – ఎంజెమ్ ఎంటర్టైన్యూర్స్ అకాడమీల సౌజన్యంతో ఈ వేడుకలు జరుపుకున్నారు . ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర డబ్ల్యూఐసీసీఐ ఉపాధ్యక్షురాలు రేవతి మాచర్ల , బయో – ఎంజెమై ఆవిష్కర్త డాక్టర్ రోసుకాన్ పూంపన్వాంగ్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు . సహజ సిద్ధ పదార్థాలతో బయో – ఎంజెమై తయారీ విధానాలను గీతమ్లోని ఈ – క్లబ్ , ఆవిష్కరణల మండలి , ఫార్మసీ విద్యార్థుల అసోసియేషన్ల విద్యార్థులకు ఆమె ఉద్బోధించారు . వారితో వాటిని తయారు చేయించడమే గాక , అప్పటికే తయారు చేసి సిద్ధంగా ఉన్న బయో – ఎంజెలో గీతం పక్కనే ఉన్న నీటి కుంటలో కలిపించారు . మనం రసం తీసుకున్నాక పడేసే నారింజ , నిమ్మ , బత్తాయి తొక్కలతో సిట్రస్ బయో – ఎంజెమైను తయారు చేసినట్టు చెప్పారు . చెరువులోని మురికి , చెడు దుమ్ములను ఈ ఎంజెమ్ తినేస్తుందని , తద్వారా నీరంతా శుద్ధి అవుతుందన్నారు . ఈ ఎంజెమ్ ఉపయుక్తమైన బాక్టీరియాను పెంపొందించడంతో పాటు నీటిలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరుస్తుందని , నీటి మొక్కలకు ఉపకరిస్తుందని చెప్పారు . ఈ ప్రక్రియలను విద్యార్థులంతా తమ ఇళ్లలో ఆచరించడం ద్వారా వ్యర్థాల పునర్వినియోగించడంతో పాటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించవచ్చని ఆమె ఉద్బోధించారు . విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులివ్వడమే గాక , వారితో ఆయా ప్రక్రియలన్నింటినీ చేయించడం విశేషం .

 

admin

Recent Posts

సమస్యల గురించి ప్రశ్నించిన విద్యార్థులకు వేధింపులా

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేయాలి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

5 hours ago

పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం 26 వేలు చెల్లించాలి

సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్ డెంట్ కు వినతి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు మనవార్తలు ప్రతినిధి ,…

5 hours ago

లక్డారం రైతుల భూములను రక్షించాలి

ఎస్ టిపి ప్లాంటు ఏర్పాటును విరమించుకోవాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, కలెక్టర్ కు వినతి మనవార్తలు ప్రతినిధి…

5 hours ago

గీతంలో ఉత్సాహభరితంగా యోగా దినోత్సవం

ఆనందంగా పాల్గొన్న గీతం ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆరోగ్యం, శ్రేయస్సుకు యోగాను ఒక సంపూర్ణ…

5 hours ago

ఫ్యూజన్ ఫిట్‌నెస్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం : యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్…

18 hours ago

యండిఆర్ ఫౌండేషన్ కు 23వ జాతీయ అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సామాజిక సేవ కార్య‌క్ర‌మాల నిర్వ‌హిస్తున్న ఎండీఆర్ ఫౌండేష‌న్ ఖాతాలో మ‌రో అవార్డు ద‌క్కింది .…

19 hours ago