ఆనం మీర్జా ఆధ్వర్యంలో దావత్-ఎ-రంజాన్ పేరుతో హైదరాబాద్ లో అతిపెద్ద రంజాన్ ఎక్స్‌పో

Hyderabad Lifestyle Telangana

_ప్రారంభించిన బాలీవుడ్ నటి రవీనా టాండన్

_మార్చి 27 నుండి ఏప్రిల్ 10 వరకు 14 రోజుల పాటు ఈ ప్రదర్శన  

మనవార్తలు ,హైదరాబాద్:

రంజాన్ పర్వదినం నేపథ్యంలో “దావత్-ఎ-రంజాన్” పేరుతో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా అధ్వర్యంలో మెహిదీపట్నంలోని కింగ్ ప్యాలెస్ లో 14రోజుల పాటు ఎక్స్పో నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనను ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రారంభించారు. ఈ నైట్ బజార్ ప్రదర్శన లో పిల్లలు మహిళలతో పాటు అన్ని వయస్సుల వారు ఇష్టపడే ఫ్యాషన్ దుస్తులతో పాటు రంజాన్ పండగకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువుల స్టాల్ల్స్ ఈ ప్రదర్శనలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అనమ్ మీర్జా, ఆమె భర్త క్రికెటర్/లాయర్ అయిన అసదుద్దీన్ మొహద్‌(భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మొహద్ కుమారుడు)తో కలిసి మూడోసారి ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని అతిపెద్ద ఎక్స్‌పో అయిన దావత్-ఎ-రంజాన్ ఈవెంట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని రవీనా టాండన్ అన్నారు. హైదరాబాద్‌ అంటే చాలా ఇష్టం, చాలా రోజుల తర్వాత నేను హైదరాబాద్‌కి వచ్చాను, హైదరాబాద్ బిర్యానీ, హలీమ్‌ రుచులను ఎంతగానో ప్రేమిస్తానని అన్నారు.ప్రదర్శనలో భాగంగా అనేక రకాల స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్ మరియు సరదాతో కూడిన అతిపెద్ద ప్రదర్శనగా ఇది నిలుస్తుందని ఆనం మిర్జా అన్నారు. ఈ నెల ఏప్రిల్ 10 వరకు ఈ వేడుక జరుగుతుందని అన్నారు.

నేను హైదరాబాది ని రంజాన్ మాసంలో అందరికీ ఇష్టమైన ఈ 14 రోజుల ప్రదర్శనను నగర వాసులకు అందుబాటులోకి తీసుకు రావడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ నగరంలో నడిబొడ్డు ఉన్న ఓల్డ్ సిటీలో ఈ ప్రదర్శనను తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉందని” అనమ్ మీర్జా అన్నారు. దావత్-ఇ-రంజాన్ వేదిక భాగస్వామి అయిన అబండెన్స్ రీజినల్ హెడ్ మిస్టర్ జాకీ జియావుద్దీన్ అలీ మాట్లాడుతూ.. ఈ రకమైన ఈవెంట్‌తో అనుబంధం కలిగి ఉన్నందుకు చాలా గొప్పగా ఉందన్నారు. ప్రదర్శనలో గాజుల మెరుపులు, హలీమ్ సువాసన, ఇరానీ చాయ్ రుచి మరియు మెహందీ యొక్క మెరుపును ప్రతిధ్వనిస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *