_బిఆర్ఎస్ లో చేరిన జిన్నారం వైస్ ఎంపీపీ గంగు రమేష్, ఖాజిపల్లి ఎంపీటీసీ ఆకుల భార్గవ్, బి ఎస్ పి నియోజకవర్గ కన్వీనర్ ఓం ప్రకాష్
_ఆత్మీయ స్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ 100 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో.. జిన్నారం మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వైస్ ఎంపీపీ గంగు రమేష్, ఖాజిపల్లి ఎంపీటీసీ ఆకుల భార్గవ్, బహుజన సమాజ్ పార్టీ (బి ఎస్ పి) నియోజకవర్గ కన్వీనర్ ఓం ప్రకాష్, తదితరులు ఎమ్మెల్యే జిఎంఆర్, శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణల సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలు తయారు చేయడమే తప్ప అమలు చేసిన చరిత్ర లేని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోను ప్రకటించి అధికారంకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. నేడు అదే పంథాలో కొనసాగుతూ ప్రజలను మోసగించేందుకు మరోసారి ఓట్లు అడిగేందుకు బయలుదేరిందని దుయ్యబట్టారు. 14 సంవత్సరాల పాటుగాని పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంలో తెలంగాణ ప్రగతి దేశానికి దిక్సూచిగా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకొని తమ రాష్ట్రాల్లో అమలు చేయడం తెలంగాణ గొప్పతనానికి నిదర్శనం అని అన్నారు.
పటాన్చెరు నియోజకవర్గంలో పదేళ్ల కాలంలో 9వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలను అందించడం జరిగిందని తెలిపారు.ప్రధానంగా విద్య, వైద్య, ఉపాధి రంగాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.రాబోయే 40 రోజుల్లో పాటు ప్రతి కార్యకర్త పార్టీ విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తూ విషయంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే బిఆర్ఎస్ పార్టీలోకి మరిన్ని వలసలు ఉంటాయని తెలిపారు.వాటిలో చేరిన వారిలో.. కాజిపల్లి వార్డ్ సభ్యురాలు ఆకుల ముత్యాలమ్మ, ఊట్ల మాజీ వార్డు సభ్యులు బిక్షపతి, ప్రవీణ్ చారి, రాంప్రకాష్, గంగు సత్యనారాయణ, గంగు వెంకటేష్, అబ్దుల్ హఫీజ్, లక్షమ్మ, జగదాంబ, బాబు, కుమార్, రాము, శ్రీను, సాయి, మహేష్, గణేష్, జితేందర్, తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, గుమ్మడిదల జెడ్పిటిసి కుమార్ గౌడ్, గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్లు పుష్ప నగేష్ యాదవ్, మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ జిన్నారం మండల అధ్యక్షులు రాజేష్, అమీన్పూర్ మున్సిపల్ అధ్యక్షుడు బాల్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.