ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు
నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని కర్ధనూరు గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ వర్ధంతిని పురస్కరించుకొని గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ వడ్డే కుమార్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.