మనవార్తలు ,రామచంద్రపురం:
పేద ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటూ పేదింటి పెద్ద కొడుకు ల వ్యవహరిస్తున్నారని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీకి చెందిన షేక్ రాఫిక్ కి 60000 వేల రూపాయలు, నాందేవ్ కు 32000 రూపాయలు,ఫెన్సింగ్ ఏరియా కి చెందిన గోపాల్ కు 28000,ఎస్. ఎన్ కాలనీ కి చెందిన భార్గవ కు 16000,అశోక్ నగర్ కు చెందిన సత్యనారాయణ కు 60000 వేల రూపాయలు, కొల్లూరు కు చెందిన సుశీల కు 9500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు.
సీఎంఆర్ ద్వారా దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమనికి రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్,సర్కిల్ ప్రెసిడెంట్ పరమేష్ యాదవ్, సెక్రెటరీ భాస్కర్ ముదిరాజ్, 111 డివిజన్ ప్రెసిడెంట్ బూన్,సర్కిల్ యూత్ ప్రెసిడెంట్ నర్సింహ, మహిళ సర్కిల్ ప్రెసిడెంట్ రాణి,సర్కిల్ బి.సి ప్రెసిడెంట్ కృష్ణ మూర్తి, కార్మిక విభాగం ప్రెసిడెంట్ రాఫిక్, స్టేట్ బి.సి సెక్రటరీ కృష్ణ గౌడ్,శ్రీలత, రాజేష్, గౌస్, కృష్ణ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.