_ఇస్నాపూర్ వరకు మెట్రో కూత..
_సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు
_గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సత్యనారాయణ ఎంపిక పట్ల హర్షం
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
మియాపూర్ నుండి పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వరకు మెట్రో రైలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల పటాన్చెరు ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఇటీవల పటాన్చెరులో జరిగిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన సభలో.. నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలు పొడిగించాలని కోరుతూ ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి విజ్ఞప్తి చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలి క్యాబినెట్ లోనే మెట్రో రైల్ విస్తరణ పనులకు ఆమోదం తెలుపుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే మెట్రో రైల్ విస్తరణ పనులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు విస్తరణ పనులకు త్వరితగతిన ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.