– ‘ స్టడీ ఎబ్రాడ్ ‘ ఫెయిర్లో వక్తలు ఉద్ఘాటన పాల్గొన్న విదేశీ వర్సిటీల ప్రతినిధులు
మనవార్తలు ,పటాన్ చెరు:
విద్యార్థుల అభిరుచులకు తగ్గట్టుగా అత్యుత్తమ కోర్సులు , ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలతో , అత్యధిక ప్రాంగణ నియామకాలతో , ఆకర్షణీయ ఉపకార వేతనాలతో అందుబాటులో ఉన్నట్టు అమెరికా విశ్వవిద్యాలయాల ప్రతినిధులు వెల్లడించారు . హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం ‘ స్టడీ ఎబ్రాడ్ ‘ పేరిట నిర్వహించిన ఫెయిర్లో బోస్టన్ విశ్వవిద్యాలయం మార్కెటింగ్ – ఎన్రోల్మెంట్ డెరైక్టర్ మార్క్ ఐ.ఖాన్ ; కొలంబియా అసోసియేట్ డెరైక్టర్ ( గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ ) మేఘన్ జెన్సీసన్ ; జార్జ్ వాషింగ్టన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ( ఎన్రోల్మెంట్ ) బ్రిట్టనీ జి.రెట్ : న్యూయార్క్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ డెరెక్టర్ ( గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ ) కెర్రీ బౌలింగ్ ; సీడ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సహ వ్యవస్థాపకుడు పరాస్ ఫట్నాల్ తదితరులు పాల్గొన్నారు .
ఆయా ప్రతినిధులు విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో తమ కోర్సులు , వాటి ప్రాముఖ్యత , వసతులు , దరఖాస్తులు , ట్యూషన్ ఫీజు , ఆర్థిక సాయం ( స్కాలర్షిస్ ) వంటి వివరాలను తెలియజేశారు . విద్యార్థులు లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేశారు . ఈ ఫెయిర్లో దరఖాస్తు చేసుకున్న గీతం విద్యార్థులకు దరఖాస్తు రుసుము మినహాయింపుతో పాటు ప్రత్యేక స్కాలర్షిస్లు ఇస్తామని వారు హామీ ఇచ్చారు . గీతం లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అధికారి వేణుగోపాల్ అరిగల అతిథులను స్వాగతించగా , శిక్షణాధికారి బి.సంతోష్ కుమార్ వందన సమర్పణ చేశారు .
తొలుత , ఈ విదేశీ ప్రతినిధులంతా గీతం ఉన్నతాధికారులతో సమావేశమై గీతమ్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు తెలిపారు . ఈ కార్యక్రమంలో గీతం ఇంజనీరింగ్ డీన్ సి.విజయశేఖర్ ; స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య ; కెరీర్ గెడైన్స్ సెంటర్ డెరైక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ , హ్యుమానిటీస్ డెరెక్టర్ ప్రొఫెసర్ వె.ప్రభావతి , ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ , ఆర్కిటెక్చర్ డెరెక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ , ఇతర కెరీర్ ఆప్షన్స్ డాక్టర్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…