వ్యవస్థాపకులుగా ఎదగండి…

politics Telangana

విద్యార్థులకు ఎన్ఐఆర్ఎం డెరైక్టర్ డాక్టర్ వెంకటేష్ సూచన

– విజయవంతంగా ముగిసిన కార్యశాల

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

మనదేశంలో అంచనా, విశ్లేషణ సాధనాలు చాలా పరిమితంగా ఉన్నాయని, భవిష్యత్తు కోసం డేటాను విశ్లేషించే నెఫుణ్యం సాధిస్తే వ్యవస్థాపకులుగా ఎదిగి, సొంత కాళ్లపై నిలబడొచ్చని బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం) డెరైక్టర్ డాక్టర్ హెచ్.ఎస్.వెంకటేష్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘జాతి నిర్మాణంలో రాక్ ఇంజనీరింగ్’ పాత్ర అనే అంశంపై మంగళవారం నిర్వహించిన ఒక రోజు కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్ ‘ లో భాగంగా, కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్ఐఆర్ఎం. సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేశారు.స్టార్టప్ ఇండియా ఉద్యమం 2004లో ప్రారంభం కాగా, 2015 వరకు కేవలం వంద స్టార్టప్లు మాత్రమే ఉన్నాయని, ఆ సంఖ్య నేటి లక్షకు చేరినట్టు సభికుల హర్షధ్వానాల మధ్య డాక్టర్ వెంకటేష్ ప్రకటించారు. అయితే అందులో కేవలం 82 మాత్రమే గనుల రంగానికి చెందినవని, ఆ రంగంలోని సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యాన్ని సాధిస్తే డేటా సెట్టింగ్గా ఎదగొచ్చన్నారు. ‘రాక్ బ్లాస్టింగ్ ఎ టూల్ ఫర్ డెవలప్మెంట్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.

సభాధ్యక్షత వహించిన గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హెదరాబాద్ డెరైక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్.శాస్త్రి మాట్లాడుతూ, గనుల, శక్తి, ఓడరేవులు, క్రూడాయిల్ వ్యూహాత్మక నిల్వ, భౌగోళిక అనుసంధాన (రహదారుల) రంగాలలో అనేక ప్రాజెక్టులు మనదేశంలో అమలు చేస్తున్నారని, మౌలిక సదుపాయాల రంగం భారత్ దూసుకుపోతోందన్నారు. జోజిలా వంటి సొరంగాల తవ్వకంలో ఇంజనీర్ల కొరతను ఎదుర్కొంటోందని, కోర్ ఇంజనీరింగ్కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. ‘రాక్ ఇంజనీరింగ్: మనదేశం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై ఉపన్యసించారు.గౌరవ అతిథిగా హాజరైన వెన్సార్ కన్స్ట్రక్షన్స్ సలహాదారు డాక్టర్ ఎం.ఎస్.వెంకటరామయ్య మాట్లాడుతూ, వర్ధమాన ఇంజనీర్లుగా ఎదుగుతున్న విద్యార్థులు సవాళ్లను స్వీకరించి, మెరుగెన పరిష్కార మార్గాలను కనుగొనాలని సూచించారు. ప్రమాదాలకు భయపడి గత 30 ఏళ్లగా మూతపడ్డ ఎన్నో బొగ్గు గనులను తాము ఉత్పాదకతలోకి తీసుకొచ్చినట్టు చెప్పారు.

తొలుత, కార్యశాల నిర్వాహకురాలు ప్రొఫెసర్ టి. మాధవి దాని లక్ష్యాలతో పాటు గీతమ్ గురించి వివరించగా, సమన్వయకర్త డాక్టర్ సీహెచ్. అఖిలేష్ వందన సమర్పణ చేశారు.ఎస్ఐఆర్ఎం శాస్త్రవేత్తలు డాక్టర్ పీసీ ఝా, డాక్టర్ అజయ్ కుమార్, డాక్టర్ బీఎన్పీ శివప్రసాద్ తదితరులు నిజ-సమయ సవాళ్ల గురించి అవగాహన కల్పించడానికి రాక్ ఇంజనీరింగ్పై పరిశోధనల సైద్ధాంతిక, ఆచరణాత్మక అంశాలను వివరించారు. హెబ్రీడ్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మనదేశంలోని ఇరవై విద్యా సంస్థలకు చెందిన దాదాపు 1,150 మంది విద్యార్థులు, అధ్యాపకులు ఈ ఒకరోజు కార్యశాలలో పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *