పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు పట్టణం శాంతినగర్ కాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు సహకారంతో ప్రిన్సిపల్ దీప దేవానంద్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ బతుకమ్మ వేడుకలకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మాధవి, టౌన్ జనరల్ సెక్రటరీ అరుంధతిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బతుకమ్మలను ఒక దగ్గర చేర్చి ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… మహిళలకు ఇష్టమైన పండగలలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో బతుకమ్మ ఆటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికి బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే దీప దేవానంద్ గౌడ్ మాట్లాడుతూ… మా పాఠశాల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ముఖ్య అతిథులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రతి ఒక్కరికి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ తరఫున బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.