రామచంద్రపురం లో బస్తీ దర్శన్ కార్యక్రమం
బస్తీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి బస్తి దర్శన్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ అన్నారు.
బస్తి దర్శన్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ కనుకుంట ఫేస్ 1(గండమ్మా గుడి ముందు) ఉన్న కాలనీ లో అక్కడ ఉన్న సమస్యల GHMC అధికారుల దృష్టికి రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తీసుకెళ్లారు.
ముఖ్యంగా వర్షం పడ్డప్పుడు రోడ్ల మీద నీరు నిలుస్తుందని,డ్రైనేజీ సమస్య,సి సి రోడ్,ఫాదర్ స్కూల్ పక్కన ఉన్న పాత నాలా డిసైల్టింగ్ మరియు ఎక్సపన్షన్ చేయుట, లారీల పార్కింగ్,డ్రైనేజీ వంటి సమస్యలు ఉన్నాయి అని పర్యటనలో కార్పొరేటర్ కుబస్తి వాసులు తెలిపారు. అలాగే కైలాష్ నగర్ కాలనీ పోచమ్మ గుడి వద్ద ట్రాన్స్ఫార్మర్ మార్చట విషయంపై కాలనీ వాసులు తమ దృష్టికి తీసుకువచ్చారని ఆమె తెలిపారు. బస్తి దర్శన్ లో తమ దృష్టికి వచ్చిన పనులు అన్ని సంబంధిత అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరిస్తాం అని కార్పొరేటర్ కాలనీ వాసులకు హామి ఇచ్చారు . బస్తీ దర్శన్ కార్యక్రమంలో నర్సింహా రెడ్డి,యది రెడ్డి,రామకృష్ణ,సత్తి రెడ్డి,కుమార స్వామి,AE ప్రభు,SFA సంపత్,కాలనీ వాసులు పాల్గొన్నారు.