ఇంద్రేశం తాత్కాలిక సర్పంచ్ గా బండి హరిశంకర్ …
పటాన్ చెరు:
పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామ తాత్కాలిక సర్పంచ్ గా బండి హరిశంకర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇంద్రేశం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లను ఆరు నెలల పాటు జిల్లా కలెక్టర్ విధుల నుంచి తొలగించడం తో బుధవారం గ్రామ పంచాయితీలో ఇన్చార్జి ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వార్డు సభ్యులలో సీనియర్ వార్డు సభ్యులుగా ఉన్న బండి హరి శంకర్ ను ఇంచార్జీ సర్పంచ్ గా బాధ్యతలను అప్పగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు తాత్కాలిక సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహాయ సహకారాలతో పాలకవర్గం తో కలిసి గ్రామపంచాయతీని అభివృద్ధి పరిచే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శులు కిషోర్. సుభాష్. పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు.