భక్తి శ్రద్ధలతో బక్రీద్…
పటాన్ చెరు:
బక్రీద్ పండుగను ముస్లింలు బుధవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పటాన్ చెరు పట్టణం,మండల పరిధిలోని వర్షం కారణంగా ఈద్గాల వద్ద కాకుండా మసీదులో మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం మత పెద్దలు సూచనలు పాటిస్తూ ముస్లింలు స్థానికంగా ఉన్న మసీదులో ప్రార్థనలు జరుపుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఈ కార్యక్రమంలో కలీం, మక్బూల్, అక్లక్, గఫర్,ఆమేర్, సాబేర్, ఫరాజ్,ఉమర్,ఫరీడ్, జకీర్ తదితరులు పాల్గొన్నారు.