_బ్రిటిష్ కాలం నాటి రస్తా కు ట్రాక్టర్లు అడ్డు పెట్టి దారి మల్లించిన సర్పంచ్
_జిల్లా ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసిన రైతులు
ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి :
గ్రామం లో అందరికి కావాల్సిన వాడని, ప్రజలకు మేలు చేస్తాడని, ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూన్న గ్రామ సర్పంచ్ బ్రిటిష్ కాలం నాటి నుండి రైతులు నిత్యం పొలాలకు వెళ్లే దారినే అపహరించిన అధికార పార్టీ సర్పంచ్ నుండి రస్తా ను కాపాడండి అంటూ గొనెగండ్ల మండలం బైలుప్పల గ్రామ రైతులు జిల్లా ఉన్నత అధికారులను ఆశ్రయించారు.కర్నూల్ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు ఉన్నత అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్న స్పందన కార్యక్రమానికి గొనెగండ్ల మండలం, బైలుప్పల గ్రామానికి చెందిన సుమారు 60 మంది రైతులు కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు.
గొనెగండ్ల మండలం, బైలుప్పల గ్రామ సర్పంచ్ పెద్ద బజారి పొలం మీదుగా సుమారు 300 ఎకరాలకు, 64 మంది రైతు కుటుంబాలు తమ పొలాలకు వెళుతూ, వస్తూ ఉంటారు, బ్రిటీస్ కాలం నాటి రస్తా ను గ్రామ సర్పంచ్ అయిన పెద్ద బజారి దౌర్జన్యంగా అడ్డుకొని, రైతుల పై దౌర్జన్యం చేస్తున్నారు.నేను వదిలిన రస్తా లొ పోవాలి కాదు కూడదని పాత రస్తా లొ తిరిగితే మీ అంతు చూస్తానని బేరిరిస్తూ బ్రిటిష్ కాలం నాటి రస్తా లో తిరగ కుండా ట్రాక్టర్లు అడ్డు పెట్టినాడు. పెద్ద బజారి ఇలా రస్తా ను అడ్డుకోవడం వలన, బజారి పొలం పైన ఉన్న రైతులు, కింద ఉన్న రైతులు అందరు వారికి ఇష్టం వచ్చినట్లు రస్తాలు మార్చుకుంటూ పోయే ప్రమాదం లేకపోలేదు, కావున గ్రామం లో ఎలాంటి గొడవలు జరగ కుండా గతం లో ఉన్న రస్తా ను యాదవిదంగా ఉంచి రైతులకు న్యాయం చేయలని రైతులు కోరుతున్నారు