​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :

భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను పటాన్‌చెరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగజీవన్ రామ్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.​అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం దక్కినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం విగ్రహాలకు దండలు వేయడం మాత్రమే కాకుండా, మహానీయుల ఆశయాలను యువతకు చేరువ చేయాలని కోరారు. ముఖ్యంగా విద్యా, వైద్య రంగాలు పేదలకు ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడే మరో అంబేద్కర్, మరో జగజీవన్ రామ్ ఈ సమాజంలో ఉద్భవిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రుద్రారం శంకర్ అడ్వకేట్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *