ఆదర్శప్రాయుడు బాబు జగ్జీవన్ రామ్_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దార్శనికుడు, దేశంలో సమసమాజ స్థాపనకు కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి నీ పురస్కరించుకొని శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజలందరూ బాపూజీ అని ప్రేమగా పిలుచుకునే బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సంగ్రామం తో పాటు, తదనంతరం ఏర్పడిన ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసి ఉత్తమ పరిపాలనదక్షుడిగా ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ప్రధానంగా దేశంలోని షెడ్యూలు కులాలు, అనగారిన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. నేటితరం యువతరానికి, ప్రజాప్రతినిధులకు జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, కొమరగూడెం వెంకటేష్, రుద్రారం శంకర్, అంతిరెడ్డి, సీనియర్ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *