పటాన్చెరు:
స్కూల్ ఆఫ్ సైన్స్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను బీ.ఆప్తో, బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు మంగళవారం వెల్లడించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలతో నిర్మించిన అధునాతన భవనంలో ప్రముఖ నేత్ర వైద్య సంస్థ ఎల్వీ ప్రసాద్ తో కలిసి బ్యాచిలర్ ఆఫ్ ఆప్లోమెట్రీ (బీ.ఆప్తో), టీసీఎస్ సహకారంతో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విత్ కాగ్నెటిన్ సిస్టమ్స్, బీఎస్సీ డేటా సెన్స్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ,
ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ విశ్వవిద్యాలయ సహకారంతో బీఎస్సీ (బ్లెండెడ్), మ్యాక్స్ – కంప్యూటర్ సైన్స్ కామన్ సబ్జెక్టులుగా నిర్వహిస్తున్న బీఎస్సీ (కెమిస్ట్రీ , ఫిజిక్స్, స్టాటిస్టిక్స్) తో పాటు ఎమ్మెస్సీ (ఎనలిటికల్, ఆర్గానిక్, ఫార్మాస్యూటికల్) కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ డేటా సైన్స్, ఎమ్మెస్సీ ఫిజిక్స్ కోర్సులలో చేరడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు.
కనీస అర్హత పరీక్ష (10 + 2) ను 60 శాతం మార్కుల సగటుతో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు యూజీలో, ఆయా సబ్జెక్టులలో బీఎస్సీ పూర్తిచేసిన వారికి పీజీలో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. బీజెడ్ సీ అభ్యర్థులు కూడా బీఎస్సీలో చేరడానికి అర్హులేనని ఆయన స్పష్టీకరించారు. ఇతర వివరాల కోసం 08455-221372 / 95 42 42 42 66 లను సంప్రదించాలని సూచించారు.
