-భూమి పూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్.
-కోటి 35 లక్షల రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణం
అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం గుట్ట పైన ఒక కోటి 35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించబోతున్నట్లు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, అయ్యప్ప భక్తుల సమక్షంలో వేద పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య ఎమ్మెల్యే జిఎంఆర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో నూతన దేవాలయాల నిర్మాణాలు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంగా సొంత నిధులతో 200 కు పైగా దేవాలయాలు నిర్మించడం జరిగిందని తెలిపారు. అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి భక్తులందరూ విరివిగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
