ఆర్టీఐ యాక్ట్ చట్టాలపై అవగాహన సదస్సు _కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ

Hyderabad politics Telangana

హైదరాబాద్

దక్షణాది రాష్ట్రాలలో విస్తృతంగా ఆర్టీఐ మరియు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ ఆదివారం జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సు లో భాగంగా చట్టాలపై అవగాహన తీసుకొచ్చేందుకు ఆర్టీఐ మరియు లోకాయుక్త మరియు సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్య్రమానికి ముఖ్య అతథిగా హై కోర్టు సీనియర్ అడ్వకేట్ బుఖ్య శంకర్ గారు(టీ. ఎస్ బార్ కౌన్సిల్ మెంబర్)  ఆర్టీఐ ట్రైనర్ అయినటువంటి డా. డి.రజితా గారు, సభ అతిథులు గా సంస్థ లీగల్ సలహాదారులు ఏ.గంగాధర్ గారు, చెగ్గం వేణు ,వైద్య అనిల్ గారు ,ముత్యాల అశోక్ , భావన రిషి గారు హరజరు అయ్యారు. సభాధ్యక్షులుగా సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి మంచికట్ల అనిల్ కుమార్  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా సంస్థ తరుపున చట్టాలపై అవగాహన కార్యక్రమాలు మరియు అవినీతి నిరోధక దినోత్సవం , ఆర్టీఐ యాక్ట్ వార్షకోత్సవాలు, ఏ. సి. బీ ఆర్టీఐ సిటిజన్ చార్టర్ బోర్డ్ ల ఏర్పాటు మేరకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగస్వామ్యులు అయిన సభ్యులకు సంస్థ తరుపున అవార్డులు మరియు గౌరవ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సెక్షన్ 2(జే)1 ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలు లో తనిఖీలు చేపట్టిన సంస్థ సభ్యులకు ప్రత్యేక అవార్డులు మరియు గుర్తింపు ఇవ్వడం జరిగింది.

భవిష్యత్ లో గ్రామ స్థాయి నుండి అవినీతిని బహిర్గతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశాం అన్నారు. ప్రజలలో చట్టాలపై అవగాహన రావటానికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అవినీతిని బహిర్గతం చేయటం కోసం మరియు అభవృద్ధి జరగాలి అంటే ఆర్టీఐ యాక్ట్ ని ప్రతి ఒక్క భారతీయుడు ఉపయోగించుకోవాలని తెలిపారు . ఆర్టీఐ యాక్ట్ గురించిన సలహాలు సూచనలు ఇవ్వటానికి జిల్లాల వారీగా కమిటీలు వేయడం జరిగింది అన్నారు.

సామాజిక దృక్పధంతో ముందుకు వెళ్తున్న కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థకు తోడ్పడుతున్న పత్రికా విలేఖరులు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అవార్డు లు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ మంచికట్ల అనిల్ కుమార్ గారు, గునుగంటీ శ్రీనివాస్ గారు, కార్యనిర్వహక బృందం జి. శ్రీనివాసులు , జనగామ అన్వేష్ , ఏలిసెట్టి ప్రసాద్, వి టెన్ టివి వి.సురేష్ కుమార్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు అయిన డా.ఈ. లక్ష్మీ ప్రశాంత్ , బత్తిన శ్రీనివాసులు మరియు ముఖ్య ప్రతినిధులు మహేష్ , మార్కండేయ రెడ్డి , సల్మాన్ రాజ్ , అప్పల నాయుడు , గోపు భాస్కర్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *