అవార్డులు ప్రతిభా ప్రోత్సాహానికి పునాదులు : నటుడు రవి ప్రకాష్

Hyderabad Lifestyle Telangana

జూన్ 28న ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్ సీజన్ 1

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్ (IIA), సీజన్ 1 జూన్ 28న నగరంలో జరుగునుంది. సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన సమావేశంలో టాలీవుడ్ నటుడు రవి ప్రకాష్ , బాలీవుడ్ నటి నికితా రావల్, దర్శకులు ప్రదీప్ మదల్లి, రాకీ సింగ్, నటుడు రేవంత్ లెవాకాతో ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ లతీఫ్, చైర్మన్ ఆదిత్య ఖురానాలు కలిసి IIA టాలీవుడ్ సీజన్ 1 పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ రివార్డులతో పాటు కళాకారులకు అవార్డులు కూడా ఎంతో ముఖ్యమని, మరింత ప్రోత్సాహాన్ని గుర్తింపు నిస్తాయన్నారు.

తెలుగు సినిమా రంగంలో కళాకారులు, టెక్నిషియన్స్ కు ఐఐఎ టాలీవుడ్ అవార్ట్స్ నైట్ నిర్వహించడమని అభినందనీయమన్నారు. మొహమ్మద్ లతీఫ్ మాట్లాడుతూ, తెలంగాణ పర్యాటక రంగం సహకారంతో ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్ మొదటి సీజన్ నగరంలో నిర్వహిస్తున్నామన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కళాకారులతో పాటు పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను తనబరుస్తున్న వారిని గౌరవించడం ఈ అవార్డుల లక్ష్యం అన్నారు. దీనిని స్టార్‌స్టడెడ్ నైట్‌గా అభివర్ణిస్తూ, వంద మందికి పైగా అవార్జులన అందజేస్తున్నట్లు తెలిపారు. 2014లో బాలీవుడ్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ IIA గత సంవత్సరం ప్రాంతీయ సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ సంవత్సరం టాలీవుడ్‌లో తన ప్రారంభ సీజన్‌ను పరిచయం చేయడం మరో మైలురాయిని సూచిస్తుందని మొహమ్మద్ లతీఫ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *