రేగోడ్, మనవార్తలు ప్రతినిధి :
యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా, క్రీడల వైపు ద్రుష్టి సారించాలని ప్రముఖ జర్నలిస్ట్ తెనుగు నర్సింలు అన్నారు. వివేకానంద జయంతి సందర్బంగా రేగోడ్ మండలం మర్పల్లి గ్రామం లో నిర్వహించిన క్రికెట్ టౌర్న మెంట్ విజేతలకు అనూష చేతులమీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. మర్పల్లి యువత క్రీడా స్ఫూర్తి ని ప్రదర్శిస్తు, మంచి స్నేహ పూర్వక వాతావరణం లో క్రిడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సంక్రాతి సెలవు రోజుల్లో యువత మొత్తం సమయం వృధా చేయకుండా ఇలా క్రీడాకారులదరు క్రీడా స్ఫూర్తి తో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమo లో నిర్వాహకులు రవి ముదిరాజ్, రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.