శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి

తిరుప‌తి తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని సోమ‌వారం ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌కు చేరుకున్న గౌ|| ముఖ్య‌మంత్రికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి క‌లిసి పుష్ప‌గుచ్ఛాలు అందించి స్వాగ‌తం ప‌లికారు. తిరుమల తిరుపతి దేవస్థానములు గోసంరక్షణకు పెద్దపీట వేస్తూ గోవిందుని, గోవు విశిష్టతను తెలియజేస్తూ […]

Continue Reading

కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం

ప్రజలకు మరింత నాణ్యమైన విద్యుత్తు ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గృహాలకు, పరిశ్రమలకు మరింత నాణ్యమైన విద్యుత్ అందించాలన్న సంకల్పంతో కోటి రూపాయలతో పటాన్చెరు సబ్ స్టేషన్లో 12.5 mva పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, విద్యుత్ సంస్థ ఉన్నత అధికారులతో కలిసి ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ […]

Continue Reading

స్వీయ క్రమశిక్షణ విజయానికి సోపానం – ప్రేరణోపన్యాసంలో ఎన్ సీసీ క్యాడెట్లకు గీతం ప్రోవీసీ ఉద్బోధ

పటాన్‌చెరు: స్వీయ క్రమశిక్షణ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి, స్వీయ నియంత్రణకు, ప్రతికూల పరిస్థితులలో కూడా సంయమనంతో వ్యవహరించడానికి ఉపకరిస్తుందని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ ఉద్బోధించారు. గీతం ఈ నెల 6 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహిస్తున్న పది రోజుల సంయుక్త వార్షిక శిక్షణా శిబిరం (సీఏటీసీ -1) లో పాల్గొంటున్న ఎన్ సీసీ క్యాడెట్లను ఉద్దేశించి సోమవారం ఆయన ప్రేరణోపన్యాసం చేశారు. ఎన్ఎసీసీ నినాదమైన ఐక్యత, క్రమశిక్షణ గురించి వివరిస్తూ […]

Continue Reading

జర్నలిస్టుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు -టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆగ్రహం

హైదరాబాద్  జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని, వివిధ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు గొప్పలు చెబుకుంటున్న పాలకులు జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) నాయకత్వం ప్రశ్నించింది. ఆదివారం నాడు హైదర్ గుడ లోని సెంటర్ పార్క్ హోటల్ కాన్ఫరెన్స్ హాలులో టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ […]

Continue Reading

ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదు… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గద్వాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామం లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి గుడిసెలో నిద్రిస్తున్న పేద కుటుంబంలో లో 5 మంది ప్రాణాలు కోల్పోయారు మోసయ్య శాంతమ్మ అనే దంపతులు అలాగే ముగ్గురు పిల్లలు చనిపోవడం జరిగింది ఇద్దరు పిల్లలు గాయాలు పాలవడం జరిగింది చాలా పేదరికంలో ఉన్నారు అయితే ముఖ్యంగా ఇండ్లు చాలా దారుణంగా ఉన్నాయి ఎస్సీ సబ్ప్లాన్ కింద 24000 కోట్లు […]

Continue Reading

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు శ్రీ దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని పటాన్చెరు లోని మహంకాళి దేవాలయంలో పటాన్చెరు శాసనసభ్యులు శ్గూడెం మహిపాల్ రెడ్డి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు. అమ్మవారి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, కార్పోరేటర్లు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, […]

Continue Reading

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రతి కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు 85 లక్షల రూపాయల సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన అమీన్పూర్ నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలక భూమిక పోషిస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మధుర నగర్, భరత్ నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, డీఎస్పీ భీంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ తో కలిసి […]

Continue Reading

సంబరంగా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ కానుకల పంపిణి

సంగారెడ్డి తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కెసిఆర్ బతుకమ్మ పండుగకు చీరల పంపిణి కార్యక్రమం సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలో సంబరగా కొనసాగుతుంది బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు నియోజకవర్గ,లో పుల్కల్ మండలం పెద్ధారెడ్డిపెట గ్రామంలో బతుకమ్మ చీరలను గ్రామంలోని స్త్రీలందరికీ గ్రామ సర్పంచ్ సతీష్ కుమార్ అందజేశారు. అనంతరం సర్పంచు మాట్లాడుతూ రాబోయే తరాలకు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అత్యంత నాణ్యమైన వస్త్రంతో బతుకమ్మ చీరలను తయారు […]

Continue Reading

క్యాన్సర్ బాధిత బాలుడికి ఆర్థిక సహాయం..

రూ 30,000 అందజేసిన సర్పంచ్ నీలం మధు గారు చిట్కుల్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గారు చికిత్స నిమిత్తం తన వంతుగా 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. రామచంద్రపురం పరిధిలోని ఎంఐజి ఫేస్-2 కు చెందిన ఎం.గౌతమ్, స్రవంతి దంపతుల కుమారుడు ఎం.గౌతమ్ వెలిమెలలోని తెలంగాణ మోడల్ స్కూల్ 8వ తరగతి విద్యార్థి. తమ కుమారుడి వైద్యం కోసం సహాయం కోరగా గురువారం తన నివాసంలో […]

Continue Reading

ఈజీ మనీ…. పెట్రోల్ బంక్ లో మైక్రో చిప్ లతో మోసం

హైదరాబాద్ పెట్రోల్ బంక్ లో మైక్రో చిప్ లతో మూడు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠా ను అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు. పెట్రోల్ బంక్ లో సాఫ్ట్ వేర్ లను మార్చి ఈ ముఠా మోసాలకు పాల్పడుతుండేవారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక లో కలిపి మొత్తం 34 పెట్రోల్ బంక్ లలో మైక్రో చిప్ ల ద్వారా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిందితులను పట్టుకున్న పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ […]

Continue Reading