కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను కట్టుకొని వినూత్న నిరసన పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ వాటర్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడ లో గల బిస్లరీ వాటర్ […]

Continue Reading

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతంలో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన శ్రమశక్తి నీతి-2025 సెమినార్ కి చుక్క రాములు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ […]

Continue Reading

ఎన్ జీ ఓ మరియు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : పురాతన కాలం నుండి వస్తున్న బాల్య వివాహల గురించిచిన్నపిల్లలు, టీనేజర్లు వారి శారీరక,మానసిక పరిపక్వతకు ముందే వివాహం చేసుకోవడం పై జరిగే అనర్థాలపై నేటి సమాజానికి అవగాహన ఉండాలని శేరిలింగంపల్లి ఆదిత్య నగర్ సెక్టార్ఐసిడిఎస్ సూపర్ వైజర్ కోమల బాయి అన్నారు. మియాపూర్ డివిజన్లోని మక్తా మహబూబ్ పేట్ ప్రభుత్వ పాఠశాలలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడానికి కొన్ని కారణాలు ఆర్ధిక […]

Continue Reading

వియత్నాంలో ఏఐ శిక్షణ ఇస్తున్న గీతం అధ్యాపకుడు

వియెన్ డాంగ్ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై రెండు వారాల కార్యశాల నిర్వహణ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదులోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నిరంజన్ అప్పస్వామి వియత్నాంలోని హోచిమిన్ నగరంలో అంతర్జాతీయ విద్యా శిక్షణ కోసం వెళ్లారు. ఆయన నవంబర్ 10 నుంచి 22 వరకు వియెన్ డాంగ్ కళాశాలలో ‘కృత్రిమ మేధస్సు (ఏఐ) బిల్డర్ బ్యూట్ క్యాంప్ – చేయడం ద్వారా […]

Continue Reading

60 లక్షల రూపాయలతో ఇంద్రేశం రహదారి మరమ్మతులు

అతి త్వరలో పూర్తిస్థాయిలో రహదారి విస్తరణ.. నిర్మాణం.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నుండి ఇంద్రేశం మీదుగా పెద్ద కంజర్ల వరకు గల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు అతి త్వరలో హెచ్ఎండిఏ ద్వారా రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నట్లు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్ చెరు పరిధిలోని ఓఆర్ సర్వీస్ రోడ్డు […]

Continue Reading

సెమీకండక్టర్ హబ్ గా భారతదేశం

గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్ హబ్ గా మారే దిశగా క్రమంగా పురోగమిస్తోందని ఐఐటీ భువనేశ్వర్ లోని ఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ పి.విజయ శంకర్ ఆశాభావం వ్యక్తపరిచారు. గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేధస్సు/మెషీన్ లెర్నింగ్- 5జీ నుంచి 6జీకి నడిచే కమ్యూనికేషన్, అనుసంధానించిన ఇంటెలిజెన్స్’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల […]

Continue Reading

వచ్చే మూడు దశాబ్దాలూ వెక్టర్ డేటాబేస్ లదే

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు వెక్టర్ డేటాబేస్ లకు చెందుతాయని, అభివృద్ధి చెందుతున్న డేటా ప్రపంచంలో అందుకు అనుగుణంగా ఉండటానికి గణితంపై పట్టు సాధించాలని హైదరాబాదు విశ్వవిద్యాలయం పూర్వ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణితం, గణాంకాల విభాగం ఆధ్వర్యంలో ‘వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో డేటా సైన్స్ పాత్ర’ అనే అంశంపై బుధవారం ఆయన […]

Continue Reading

పోలీసుల సేవలు మరువలేనివి – కృష్ణ మూర్తి చారి

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు. పటాన్ చెరు పోలీస్ డిపార్ట్ మెంట్ లో 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా, సంగారెడ్డి సిఐ రమేష్, ఆదిలాబాద్ ఏఎస్ఐ భూమన్న జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అర్జున్ ,హైదరాబాద్ ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ గోపాల్,కర్నూల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బషీర్, వరంగల్ ఎక్సైజ్ […]

Continue Reading

జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం యలమంచి ఉదయ్ కిరణ్

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్ గా మారింది.హైద‌రాబాద్ జిల్లా ప‌రిధిలోని జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల ముఖ్య నేత‌లు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా యూసుఫ్‌గూడ డివిజన్‌ నాగార్జున నగర్ కాలనీలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు . యలమంచి ఉదయ్ కిరణ్ ఆయన బృందం ఇంటింటికి వెళ్లి, […]

Continue Reading

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : నియోజకవర్గ ప్రజల సంక్షేమం ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. మంగళవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాలు, పట్టణాలు, […]

Continue Reading