ఆశా వర్కర్ల కు ఫిక్స్ డ్ వేతనం 18 వేలు ఇవ్వాలి_సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఆశ వర్కర్లకు పిక్స్ డ్ వేతనం 18వేలు రూపాయలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పటాన్ చెరు లో ఆశా వర్కర్ల సమ్మెను రాజయ్య ప్రారంభించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతు ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు.ఆశా వర్కర్ల కు పని భారం విపరీతంగా పెరిగిపోయిందన్నారు.ఫిక్స్డ్ వేతనం 18 వేలు నిర్ణయించి,అమలు చేయాలన్నారు.ప్రస్తుతం వారికి 9 వేల పారితోషకం మాత్రమే వస్తుందని.నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని వచ్చే వేతనాలు ఎక్కడ సరిపోవడం లేదన్నారు.ఆశా వర్కర్ల కు పి ఎఫ్, ఈ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్న,ఉద్యోగ భద్రత లేక అల్లాడుతున్నారన్నారు. ఆశా వర్కర్ల కు హెల్త్ కార్డులు,ప్రమాద భీమా సౌకర్యం 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా లకు రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.డిమాండ్ల సాధన కోసం అనేక సందర్భాల్లో విన్న వించడం జరిగిందన్నారు.తప్పని పరిస్థితుల్లో సమ్మె కు వెళ్ళడం జరిగిందని అన్నారు. డిమాండ్ల సాధించుకునేంతవరకు సమ్మె విరవించపోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు, ఆశలు గీత,హైమవతి,మాధవి,వనజ, వైశ్నవి, వీరమని,సరిత, లక్ష్మీ ఇతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *