ఆశా వర్కర్ల కు ఫిక్స్ డ్ వేతనం 18 వేలు ఇవ్వాలి : సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఆశా వర్కర్ల కు ఫిక్స్ డ్ వేతనం 18 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమ్మె లో భాగంగా 5 వరోజు గురువారం పటాన్ చెరు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం తహసిల్దార్ భాస్కర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతు ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు.ఆశా వర్కర్ల కు పని భారం విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు.ఫిక్స్ డ్ వేతనం 18 వేలు నిర్ణయించి,అమలు చేయాలని అన్నారు.ప్రస్తుతం వారికి 9 వేల పారితోషకం వస్తుందన్నారు.నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని వచ్చే వేతనాలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదని వాపోయారు.ఆశా వర్కర్ల కు పి ఎఫ్, ఈఎస్ ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఆశా వర్కర్ల కు హెల్త్ కార్డులు,ప్రమాద భీమా సౌకర్యం 5 లక్షలు, ఆశా లకు రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.డిమాండ్ల సాధన కోసం అనేక సందర్భాల్లో విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేక పోవటంతో తప్పని పరిస్థితుల్లో సమ్మె కు వెళ్ళడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోఆశా వర్కర్లు గీత,హైమవతి,మాధవి,వైశ్నవి, వీరమని,సరిత, లక్ష్మీ ఇతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *