పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
ఉత్పత్తి అభివృద్ధి ప్రక్రియలను మెరుగుపరచడానికి, మార్కెట్‌ను వేగవంతం చేయడానికి, పోటీతత్వాన్ని పొందేందుకు స్టార్టప్‌లు కృత్రిమ మేథను వినియోగిస్తున్నాయని ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ప్రముఖ ఇన్నోవేటర్ చెత్తన్య ముప్పాల చెప్పారు. గీతం వర్సిటీలోని వెంచర్ డెవలప్ మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా, బుధవారం ఆయన ‘కృత్రిమ మేథ భవిత, ఉత్పత్తి అభివృద్ధి మెళకువలపై విద్యార్థులకు దిశానిర్దేశనం చేశారు. ఉత్పత్తి అభివృద్ధి భవిష్యత్తును అంచనా వేయడానికి బహుళజాతి కంపెనీలు కృత్రిమ మేథ (ఏణ)ను ఎలా వినియోగిస్తారో ఆయన వివరించారు. మనదేశంలో కూడా ఉత్పత్తి అభివృద్ధిలో కృత్రిమమేథ సామర్థ్యాన్ని నిరివిగా వినియోగిస్తున్నారని చెప్పారు.

ఏఐ అల్గారిథమ్ ద్వారా విస్తారమైన డేటాను వర్ధమాన వ్యవస్థాపకులు ఎలా? విశ్లేషించాలో చెత్తన్య వివరించారు. ఏఐ ఆధారిత విశ్లేషణలను ఉపయోగించడం ద్వారా స్టార్టర్లు, ఉత్పత్తి అభివృద్ధిలోమరింత సమాచారంతో నిర్ణయాలు తీసుకోవచ్చని, తద్వారా నిర్దిష్ట వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించవచ్చని ముప్పాల నిశదీకరించారు.విద్యార్థుల స్టార్టన్ల కోసం ‘రెడీ-సెట్-గో’ అనే ప్రీ-ఇంక్యుబేషన్ కార్యక్రమాన్ని NUIDea ప్రోగ్రామ్ మేనేజర్ కునాల్ గిర్ నిర్వహించారు. యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన, నిర్మాణాత్మక వనరులు, మార్గదర్శకత్వం అందించడం ద్వారా వినూత్న ఆలోచనలను ఆచరణీయ వ్యాపార సంస్థలుగా మార్చడం, వారి అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యంగా ఆయన వివరించారు.


ఈ ఆరు రోజుల సమ్మర్ స్టార్టప్ స్కూల్ ‘ఇంక్యుబేటర్ ఫీల్డ్ విజిట్, సంగారెడ్డి జిల్లా, కందిలోని ‘అక్షయపాత్ర’తో పాటు ఐఐటీ హైదరాబాద్ సందర్శనతో ముగిసింది. దీనిని వీడీసీ సీనియర్ వెంచర్ కోచ్, కార్యక్రమ నిర్వాహకులు వాసుదేవ్ వంగర, యామిని కృష్ణ రాపేటిలు పర్యవేక్షించారు.
