జనరేటివ్ ఏఐ వర్క్ షాప్ లో నెక్స్ట్ వేవ్ గ్రోత్ మేనేజర్ ప్రశాంత్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
భవిష్యత్తు సాంకేతికతలో కృత్రిమ మేథ (ఏఐ) కీలక భూమిక సోషించబోతోందని, విద్యార్థి దశ నుంచే దానిపై పట్టు సాధించాలని నెక్స్ట్ వేవ్ గ్రోత్ మేనేజర్ ప్రశాంత్ ఏఆర్ స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కోగాన్ (సాంకేతిక మెళకువులను ప్రోత్సహించే విద్యార్థి విభాగం) మంగళవారం నిర్వహించిన ఒకరోజు ‘జెనరేటివ్ ఏని వర్క్ షాప్ లో ఆయన ప్రధాన వక్త, శిక్షకుడిగా పాల్గొన్నారు. గీతమ్ లోని స్టూడెంట్ లైఫ్ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఏఐఈఎస్ఈసీల సంయుక్త సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యశాలలో వివిధ రంగాలలో కృత్రిమ మేథ సాధనాలు, వాటి వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. ఏఐ టూల్స్, ఆచరణాత్మక అభ్యాసం, చాటిజెపీటీ వంటి వాటిపై ఆయన గీతం విద్యార్థులకు ప్రాథమిక అవగాహన కల్పించారు. వేగవంతమైన వృద్ధి, మంచి సామర్థ్యాన్ని సమకూర్చుకోవడం కోసం కృత్రిమ మేథ సాధనాల వినియోగంపై విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే పట్టు సాధించాలని ఆయన సూచించారు. వాటి జీపీటీ, సూపర్ ఛార్జ్ కంటెంట్ క్రియేటర్, ఫ్లెక్సిటీ ఏఐ, దాల్-ఈ, డ్రీమ్ వార్బ్ , రన్ వే ఎంఎల్, పోరా, క్లీన్ చామ్ వంటి పలు రకాల కృత్రిమ మేథ సాధనాలను గీతం విద్యార్థులకు ప్రశాంత్ పరిచయం చేశారు. అలాగే ఫ్రీమర్, హోస్టింగర్ వంటి ఏఐ సాధనాల గురించి కూడా ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ సాధనాల గురించి మంచి అవగాహన ఏర్పరచుకుని, వాటిపై ఆవరణాత్మక ప్రయోగాలు చేయాలంటూ వారిని ప్రోత్సహించారు. ఈ కార్యశాలలో విద్యార్థులు కృత్రిము మేథ సాంకేతికత, భవిష్యత్తు, వివిధ పరిశ్రమలలో దాని వినియోగం వంటి అంశాలపై విద్యార్థులు లోతెన అవగాహనను ఏర్పరచుకున్నారు. వాటిపై మరింత అవగాహన, ఉత్సుకతలను పెంపొందించడానికి ప్రశాంత్ కొన్ని వీడియోలు చూపుతూ, వాటిపై లోతుగా ఆలోచించి, ప్రశ్నలు అడిగేలా విద్యార్థులను ప్రోత్సహించారు.